Nandamuri Kalyan Ram’s Devil – The British Secret Agent Glimpse: గతేడాది ‘బింబిసార’ సినిమాతో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్ లో పెట్టారు. నిజానికి ఈ ఏడాది ‘అమిగోస్’ అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఎందుకో కానీ ఈ సినిమా జనానికి పెద్దగా కనెక్ట్ అవలేదు. ఇక ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘డెవిల్’ నుంచి ఒక గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాతో నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. నిజానికి ఆయన గతంలో సిన్ అనే ఒక వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘బింబిసార’ సినిమాలో కళ్యాణ్ రామ్ తో కలిసి నటించిన సంయుక్త మీనన్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బర్త్ డే స్పెషల్ గా ‘డెవిల్’ యూనిట్ రిలీజ్ చేసిన గ్లింప్స్ అయితే ఆసక్తికరంగా ఉంది. గ్లింప్స్ బట్టి చూస్తే కనుక ఈ ‘డెవిల్’ సినిమా బ్రిటిష్ కాలంలో సాగే ఒక పీరియాడిక్ కథలా కనిపిస్తోంది.
Rangabali Interview: జర్నలిస్టుల స్పూఫ్ ఇంటర్వ్యూ పార్ట్ 2 వచ్చేసింది.. సత్య చించేశాడుగా!
కళ్యాణ్ రామ్ బ్రిటిష్ కాలంలో ఉండే ఒక సీక్రెట్ ఏజెంట్ గా గ్లింప్స్ తో క్లారిటీ వచ్చేసింది. గ్లింప్స్ లో విజువల్స్ సాలిడ్ గా కనిపిస్తుండగా కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ‘‘మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు, మొదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయట పడకూడదు, అదే గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం’’ అని కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక సినిమా గ్లింప్స్ లో చూపిన విజువల్స్ చాలా గ్రాండ్ గా పర్ఫెక్ట్ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తి పెంచేస్తున్నాయి. ఇక అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ శ్రీకాంత్ విస్సా అందిస్తున్నారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ డెవిల్ మూవీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక ఈ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ రామ్ బింబిసార లాంటి మరో హిట్ ఈ డెవిల్ తో అందుకుంటాడని భావిస్తున్నారు.