Site icon NTV Telugu

Nandamuri Kalyan Ram: డెవిల్ 2 స్టోరీ.. లీక్ చేసిన కళ్యాణ్ రామ్

Kalyan Ram

Kalyan Ram

Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ నామా దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం డెవిల్. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కీలక పాత్రలో నటించింది. ఇక నేడు ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. 1945లో బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ అంటూ ఈ డెవిల్ సినిమా గురించి ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది సినిమా యూనిట్. ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్ అనే టైటిల్ రోల్ లో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. ఎప్పుడూ సెటిల్డ్ గా నటించే ఆయన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తో దుమ్ము రేపాడు. ఇక సంయుక్త మీనన్ కి మంచి రోల్ పడింది, అందంగా కనిపిస్తూనే నటన విషయంలో మంచి మార్కులు వేసుకునేలా నటించింది. మాళవిక పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో అదరగొట్టింది. అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, వశిష్ట సింహ, జబర్దస్త్ మహేష్, షఫీ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ఇక సినిమా హిట్ అవ్వడంతో చిత్ర బృందం సెలబ్రేషన్స్ లో మునిగితేలింది. ఇక ఈ సెలబ్రేషన్స్ లో కళ్యాణ్ రామ్ డెవిల్ 2 గురించి ఓపెన్ అయ్యాడు. డెవిల్ 2 ఉంటుందా అన్న ప్రశ్నకు కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. “డెవిల్ 2 ఉంటుంది. నా టీమ్ మెంబర్స్ తోనే ఉంటుంది. 2024 లో డెవిల్ 2 మొదలుపెట్టి.. 2025 లో రిలీజ్ చేస్తాం. ఇప్పుడు చెప్పడం అనేది కాదు.. ఈ సినిమా షూటింగ్ మొదలైన 10 రోజులకే శ్రీకాంత్ నాకు కథ చెప్పాడు.సీక్రెట్ సర్వీస్ తో కథను ముందుకు తీసుకెళ్లొచ్చు అని.. చాలా బావుంది ప్లాట్. ఇక డెవిల్ 2 లో 1940 ఎరా కనిపిస్తుంది.. 2000 ఎరా కూడా కనిపిస్తుంది. ఈ రెండు కాలాలు కలిపి చూడబోతున్నారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి

Exit mobile version