NTV Telugu Site icon

Amigos: ఇదెక్కడి మేకోవార్ రా మావా… కళ్యాణ్ రామ్ ని గుర్తు పట్టడం కూడా కష్టమే

Kalyan Ram

Kalyan Ram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కేపబిలిటీ ఒక యావరేజ్ సినిమాని కూడా సూపర్ హిట్ చెయ్యగలదు అని నిరూపించిన సినిమా ‘జై లవ కుశ’. ఈ జనరేషన్ ని ఎన్టీఆర్ చూపించే అన్ని వేరియేషన్స్ ఇంకెవ్వరూ చూపించలేరు, ముఖ్యంగా నెగటివ్ టచ్ ఉన్న రోల్ చెయ్యాలి అంటే అది ఎన్టీఆర్ తర్వాతే అని ప్రతి ఒక్కరితో అనిపించిన సినిమా కూడా ‘జై లవ కుశ’నే. ఒకేలా ఉండే ముగ్గురు అన్నదమ్ములుగా ఎన్టీఆర్, జై లవ కుశ సినిమాలో క్లాప్ వర్తీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇందులో ఎన్టీఆర్… అమాయకుడిగా, తింగరి దొంగగా, నెగటివ్ టచ్ ఉన్న రావణగా నటించినట్లే కళ్యాణ్ రామ్ కూడా మూడు పాత్రలతో ప్రయోగాలు చేస్తున్నట్లు ఉన్నాడు. ఈ నందమూరి హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ నుంచి న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే రెండు పోస్టర్స్ ఇచ్చి నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చిన ‘అమిగోస్’ మూవీ మేకర్స్, తాజాగా మూడో పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.

జనవరి 8న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి ట్రైలర్ ని వదలబోతున్నాం అంటూ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి మేకర్స్ వదిలిన ఈ కొత్త పోస్టర్ లో ఉన్నది కళ్యాణ్ రామ్ అని గుర్తు పట్టడానికి కూడా టైం పట్టింది అంటే అతను మేకోవర్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొదట విడుదలైన రెండు పోస్టర్స్ లో ఒక దాంట్లో కళ్యాణ్ రామ్ మోడరన్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తే, రెండో పోస్టర్ లో కంప్లీట్ ఫార్మల్ లుక్ లో కనిపించాడు. ఈ రెండు లుక్స్ ని పూర్తి భిన్నంగా గడ్డం పెంచి, పోనీ టైల్ వేసి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించిన కళ్యాణ్ రామ్ అందరికీ షాక్ ఇచ్చాడు. గన్ పట్టుకోని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కళ్యాణ్ రామ్ ఒక స్టైలిష్ విలన్ లా కనిపిస్తున్నాడు. ఇది అతని కెరీర్ బెస్ట్ మేకోవర్ అనే చెప్పాలి. అయితే మొదటి రెండు పోస్టర్స్ కి కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ పేరు ఏంటో అనౌన్స్ చేసిన మేకర్స్, ఈ మూడో పోస్టర్ విషయంలో మాత్రం సీక్రసీ మైంటైన్ చేశారు. ఈ ‘అన్-నోన్’ ఎవరో టీజర్ లోనే చూసుకోండి లేదా అమిగోస్ రిలీజ్ అవనున్న ఫిబ్రవరి 10న థియేటర్స్ లో చూసుకోండి అన్నట్లు ఉంది మేకర్స్ విధానం. రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ‘అమిగోస్’ కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెర్ఫార్మెన్స్ పరంగా ది బెస్ట్ ఫిల్మ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Show comments