NTV Telugu Site icon

Virupaksha: థ్రిల్లర్ సినిమాకి నందమూరి హీరో కాంప్లిమెంట్స్…

Virupaksha

Virupaksha

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీ ఆని సెంటర్స్ లో యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో విరుపాక్ష సినిమాకి హ్యూజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విరుపాక్ష మూవీ ఇప్పటికే దాదాపు 60 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని రీచ్ అవ్వడానికి రెడీగా ఉన్న విరుపాక్ష సినిమాపై ఆడియన్స్ నుంచే కాదు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. స్టార్ హీరోలు కూడా విరుపాక్ష సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా విరుపాక్ష సినిమా చూసి సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, కార్తీక్ దండు, అజ్నీష్ లోక్నాథ్ లని కాంప్లిమెంట్ చేశాడు. కళ్యాణ్ రామ్ ట్వీట్ కి సాయి ధరమ్ తేజ్ “అన్నా, థాంక్యూ సో మచ్” అంటూ ట్వీట్ చేశాడు.

బింబిసార సినిమాలో కళ్యాణ్ రామ్ తో కలిసి నటించిన సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ ట్వీట్ కి ఎమోషనల్ గా రెస్పాండ్ అయ్యింది. “You knew my journey as Nandini and how much I loved #Virupaksha . You have been supportive and understanding when I was juggling between #Virupaksha and #Devil , shooting for both day and night . Finally , you got to watch what I was raving about and glad that you loved it too. Thank you” అంటూ సంయుక్త ట్వీట్ చేసింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో కలిసి సంయుక్త మీనన్ ‘డెవిల్’ సినిమాలో నటిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో కనిపిస్తున్న సంయుక్త మీనన్ కి టాలీవుడ్ లో క్రేజ్ పీక్ స్టేజ్ లో ఉంది. మరి ఈ మలయాళ బ్యూటీ లక్కీ హ్యాండ్ కళ్యాణ్ రామ్ కి కూడా కలిసోస్తుందేమో చూడాలి. 

 

Show comments