NTV Telugu Site icon

Nandamuri Balakrishna: బాలయ్య.. కొడుకు గురించి ప్రతి ఏడాది ఇదే అంటున్నావ్

Moksh

Moksh

Nandamuri Balakrishna: టాలీవుడ్ స్టార్ హీరోల వారసులందరూ వచ్చేసారు. చిరంజీవి వారసుడు రామ్ చరణ్, నాగార్జున వారసులు చైతన్య, అఖిల్.. వెంకటేష్ వారసుడుగా రానా దగ్గుబాటి.. మోహన్ బాబు వారసులు.. విష్ణు, మనోజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తమదైన స్థాయిలో అలరిస్తున్నారు. ఇక అందరూ చూపు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ వారసుడుపైనే ఉంది. ఎన్నో ఏళ్లుగా నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పుకొస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించింది లేదు. ఈ ఏడాది, వచ్చే ఏడాది.. ఆపై వచ్చే ఏడాది అంటూ గత ఐదేళ్లుగా నందమూరి బాలకృష్ణ సైతం ఇంటర్వ్యూస్ లో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పుకొస్తూనే ఉన్నాడు. కానీ, అది అమల్లోకి వచ్చింది లేదు. ఇక దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అప్పట్లో కొంతమంది మోక్షజ్ఞ కు హీరో అవ్వాలని లేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మోక్షజ్ఞ హీరో మెటీరియల్ కాదు కాబట్టి హీరోగా మారడానికి కొంత టైమ్ పడుతుంది అని చెప్పుకొచ్చారు. అప్పట్లో బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఫిట్ గా తయారయ్యి హీరోగా మారాడు. అంతేకాకుండా ఈ మధ్య మీడియా ముందుకు కూడా బాగానే వస్తున్నాడు. భగవంత్ కేసరి సెట్ లో మోక్షజ్ఞ చాలా సార్లు మెరిశాడు.

Chiranjeevi: ఏదైనా.. నీ గొప్ప మనసు ఎవరికి లేదయ్యా

ఇక భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో బాలయ్య మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఖరాకండీగా చెప్పేశాడు. శ్రీలీల, బాలయ్య స్పెచల్ చిట్ చాట్ లో శ్రీలీల ఇంతకీ మోక్షజ్ఞ డెబ్యూ ఎప్పుడూ ఉంటుంది అని అడిగిన ప్రశ్నకు బాలయ్య సూటిగా సమాధానం చెప్పాడు. మోక్షజ్ఞ ఎంట్రీ 2024 లో ఉంటుందని తడుముకోకుండా చెప్పాడు. దీంతో వచ్చే ఏడాది నందమూరి వారసుడు టాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అని చెప్పుకొస్తున్నారు. అయితే ఎప్పటిలాగానే బాలయ్య కొడుకు గురించి చెప్తున్నాడా..? లేకపోతే ఖచ్చితంగా వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా అనేది చూడాలి.

Show comments