నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ రెండో వంద కోట్ల సినిమాని ఇచ్చాడు. తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లో రోరింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇదే జోష్ లో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్న బాలయ్య, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడితో కలిశాడు. NBK 108 వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఒక జైలు సెట్ లో NBK 108 ఫస్ట్ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ కంప్లీట్ చేశారు. ఇక సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చెయ్యడమే లేట్ అనుకుంటున్న సమయంలో తారకరత్న మరణించాడు. నందమూరి తారకరత్న అకాల మరణంతో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తారకరత్న హాస్పిటల్ లో ఉన్న దగ్గర నుంచి ఆయన దశ దిన కర్మ వరకూ అన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్నాడు బాలకృష్ణ. తారకరత్న దశ దిన కార్యక్రమం అయిపోగానే బాలకృష్ణ మళ్లీ సినిమా పనులు మొదలుపెట్టడానికి రెడీ అయ్యాడు.
మార్చ్ 4 నుంచి #NBK108 సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు అనీల్ రావిపూడి, బాలయ్య-కాజల్ పైన ఈ షెడ్యూల్ లో ముఖ్య సన్నివేశాలని తెరకెక్కించడానికి ప్రిపేర్ అవుతున్నాడు. కాజల్ అగర్వాల్, బాలయ్య కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ మూవీతో కాజల్ అగర్వాల్ గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వలనుకుంటుంది. యంగ్ హీరోయిన్ శ్రీలీలా కూడా NBK 108 సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది అనే రూమర్ వినిపిస్తోంది కానీ అందులో ఎంతవరకూ నిజం ఉంది అనే విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి ఈ మూవీ షూటింగ్ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ దసరా కానుకగా రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.