NTV Telugu Site icon

Balakrishna: ఇక విజయవాడలో నెక్స్ట్ లెవల్ రాయల్టీ…

Balakrishna

Balakrishna

అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్, టాక్ షోలో హోస్ట్ గా సూపర్బ్ ఫేమ్, లైనప్ లో సాలిడ్ ప్రాజెక్ట్స్… ఇలా ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్న బాలయ్య, ట్రెండ్ కి తగ్గట్లు చేంజ్ అవుతూ మార్కెట్ కి తగ్గట్లు మారుతున్నాడు. వరసబెట్టి భారి బడ్జట్ సినిమాలు చేస్తున్న బాలయ్యకి ప్రస్తుతం యూత్ లో ఉన్న ఫాలోయింగ్ యంగ్ హీరోలకి కూడా లేదంటే ఆశ్చర్యం లేదు. సినిమాలతోనే కాదు బ్రాండ్స్ తో కూడా బాలయ్య బాబు రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే ‘శ్రీ ప్రియ గ్రూప్ 116 పారామౌంట్ రియల్ ఎస్టేట్స్’ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాలకృష్ణ, తాజాగా ‘వేగా జువేలర్స్’కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. వేగా జువేలర్స్, వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాలయ్య, మార్చ్ 8న విజయవాడలో ఓపెన్ చేస్తున్న కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కి రానున్నాడు. మార్చ్ 8న మధ్యాహ్నం 2:45 నిమిషాలకి బాలయ్య ‘వేగా శ్రీ జువేలర్స్’ బ్రాంచ్ ని ఓపెన్ చేస్తున్నారు.

Read Also: Oscars 95: ఇండియా నుంచి ఆ సెలబ్రిటీకి మాత్రమే దక్కిన అవకాశం…

Show comments