NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?

Nbk (2)

Nbk (2)

నందమూరి నటసింహం బాలకృష్ణ లైనప్‌లోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం  బాలయ్య లైనప్ చూస్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అటు కొరటాల శివ దర్శకత్వంలో ‘NBK112’  జూన్ నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరొక యంగ్ డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేయబోతున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది .

కోలీవుడ్ లో వచ్చిన మార్క్ ఆంటోని, ‘గుడ్ బాడ్ అగ్లీ’ చిత్రాల  దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో బాలయ్య ఒక పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. అధిక్ రవిచంద్రన్ ఇటీవల బాలయ్యను కలిసి ఒక అదిరిపోయే మాస్ స్టోరీ లైన్ వినిపించారని  లైన్ నచ్చడంతో ఆధిక్ కు గ్రీన్ సిగ్నల్ లభించిందని సమాచారం.  వాస్తవానికి అధిక్ రవిచంద్రన్ నెక్ట్స్ సినిమా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో చేయాల్సి ఉంది. వీరి కాంబినేషన్‌లో AK64 గా తెరకెక్కాల్సిన ఈ సినిమా పట్టాలెక్కుతుందని అందరూ భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. దాంతో ఆధిక్ ఆ కథను బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి వినిపించగా వెంటనే ఓకే చేసినట్టుగా తెలిసింది. అన్ని కుదిరి ఈ కాంబినేషన్ కుదిరితే మాత్రం బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర ఖాయమని చెప్పవచ్చు.  టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ ఉంది.

×
×
Ad