NBK 108: త్వరలో సెకండ్ షెడ్యూల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ అంటే పౌరాణికాలు, ఫ్యాక్షన్ సినిమాలే. గ్రాంధిక డైలాగులు పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాలన్నా, పౌరుషంగా సీమ డైలాగులు చెప్పాలన్నా అది బాలయ్యకే సాధ్యం. ఈ సంక్రాంతి ఇలాంటి ఫ్యాక్షన్ రోల్ లోనే వీర సింహా రెడ్డి సినిమా చేసిన బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, తన నెక్స్ట్ సినిమాని అనీల్ రావిపూడితో చేస్తున్నాడు. హిట్ గ్యారెంటీ అనే బ్రాండ్ వేల్యూని మైంటైన్ చేస్తున్న అనీల్ రావిపూడి, బాలయ్యని పక్కా తెలంగాణా యాసలో మాట్లాడిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనీల్ రావిపూడి మాట్లాడుతూ “NBK 108లో బాలయ్య టచ్ ఉంటుంది కాకపోతే ఈసారి సింహం సీమలో కాదు తెలంగాణాలో దిగుతుంది” అని చెప్పాడు. బాలయ్య నుంచి తెలంగాణా యాసలో పవర్ ఫుల్ డైలాగులు వినబోతున్నాం అనే విషయం కొత్తగా ఉంది.
Read Also: Dj Tillu 2: ఈ గిఫ్ట్ ని ఫస్ట్ లుక్ అనుకోవచ్చా?
Also Read
రెగ్యులర్ గా సీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేసే బాలయ్యకి NBK 108 మంచి చేంజ్ ఓవర్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలకి సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్, NBK 108కి మ్యూజిక్ కంపోజ్ చేస్తుండడంతో ఈ మూవీ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎలాంటి లోటు ఉండదని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన NBK 108 మూవీ ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. జైలులో వేసిన సెట్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న NBK 108, సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి మూడో వారంలో స్టార్ట్ అవ్వనుంది. ఈ షెడ్యూల్ ని మేజర్ కాస్ట్ అంతా పాల్గొంటుందని సమాచారం. మరి సీమని దాటి నైజాంలో అడుగు పెట్టిన బాలయ్య, NBK 108తో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
తాజావార్తలు
-
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
-
Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
-
CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
-
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!