నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన మాట కటువుగా ఉంటుందేమో కానీ ఆయన మనసు ఎప్పుడూ వెన్ననే .. అభిమానులను దండించినా.. ఒక మాట గట్టిగా అన్నా కూడా వారు ఫీల్ అవ్వరు అంటే అతిశయోక్తి కాదు, ఇక అలాగైనా బాలయ్య బాబు మా వైపు చూసారని, ఆయన చేయి తాకిందని ఆనందపడుతూ ఉంటారు. ఇక బాలయ్య బయట ఫంక్షన్స్ కి వస్తే సందడే సందడి.. ఆ ఈవెంట్స్ లో ఆయన ఏదో ఒక మాట అనడమో, లేక ఏదైనా కోపం వచ్చే పని చేసిన ఆరోజు మీమర్స్ కు పండగే. ఇక బాలయ్య పైకి గంభీరంగా కనిపించినా ఆయనది ఎప్పుడు చిన్నపిల్లాడి మనస్తత్వమే.. అందుకే బాలయ్య చిన్న పిల్లలు ఎక్కడ కనిపించినా వారితో ఆడుతూ ఉంటాడు. ఇక తాజాగా ఒక వేడుకలో బాలయ్య ప్రవర్తించిన తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా.. నవ్వులు పూయిస్తుంది. నేడు హిందూపురంలోని ఒక కార్యకర్త నూతన గృహప్రవేశ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశాడు.
ఇక ఆయనను చూసిన అభిమానులు ఫోటోలు కోసం ఎగబడ్డారు. ఒక అభిమాని రెండేళ్ల తన బిడ్డను ఎత్తుకొని ఫొటోకు బాలయ్య పక్కన నిలబడ్డాడు. అయితే అప్పటికి ఆ పాప నిద్రపోతుంది. దీంతో బాలయ్య ఆ పాపను తట్టి లేపుతూ.. ఏయ్ లేవు అంటూ లేపి ఫొటో వైపు చూడమని చెప్పాడు. దీంతో కిమ్మన్నకుండా చిన్నారి ఫొటో వైపు చూడడం వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై మీమర్స్ మీమ్స్ వేస్తూ రచ్చ చేస్తున్నారు. డీజే టిల్లు చిత్రంలోని ఏయ్ బాబు లేవు.. అనే డైలాగ్ ను అనుకరిస్తూ వీడియోను రీమిక్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అట్లుంటుంది బాలయ్యతోని.. అని కొందరు.. డీజే టిల్లు గా మారిన బాలయ్య అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
