Nandamuri Balakrishna: ఇప్పుడంటే.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు కొట్టుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఇలాంటి బేధాలు ఏవి ఉండేవి కావు. స్టార్ హీరోలందరు ఎప్పుడు కలిసే ఉండేవారు. ఒక హీరో సెట్ కు మరో హీరో వెళ్ళేవాడు.. ఫంక్షన్స్ కు, పార్టీలకు, ఈవెంట్స్ కు.. అవార్డ్స్ ఫంక్షన్స్ కు అందరు కలిసికట్టుగా వెళ్లేవాళ్లు. కేవలం టాలీవుడ్ హీరోలు మాత్రమే కాదు.. మిగతా భాషల హీరోలను కూడా కలిపేసుకొనేవారు. ఒక విధంగా చెప్పాలంటే.. టాలీవుడ్ మొత్తం ఒక తాటిమీదనే నడిచేది. అయితే జనరేషన్ మారేకొద్దీ.. హీరోల్లో మార్పులు వచ్చాయో లేదో తెలియదు కానీ.. అభిమానుల్లో మాత్రం మార్పులు వచ్చాయి. ఒక్కో హీరోకు వేళా సంఖ్యలో అభిమానులు అంటూ ఫ్యాన్స్ క్లబ్స్ మొదలయ్యాయి. మరొక హీరో ఫ్యాన్స్ తో గొడవలు.. మా హీరోను తక్కువ చేసి మాట్లాడితే గొడవలే అంటూ బెదిరించడాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాకా ఆ ఫ్యాన్ వార్స్ మరింత పెరిగాయి. అప్పట్లో స్టార్ హీరోలు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు కనిపిస్తే.. ఒకప్పుడు టాలీవుడ్ ఇలా ఉండేదా.. ? అని నేటి యువతరం ఆశ్చర్యపోతున్నారు.
Varun Tej: నిహారిక చిన్నపిల్ల.. లావణ్య కంటే ఆమె ముఖ్యం
తాజాగా నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన రేర్ పిక్స్ ను సంపాదించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో ఒక ఫోటోనే మీరు చూస్తున్నది. సింగిల్ ఫ్రేమ్ లో నలుగురు లెజెండ్స్. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్, నందమూరి బాలకృష్ణ కలిసి దిగిన ఫోటో ఇది. అయితే అకేషన్ ఏంటి ..? అనేది తెలియదు కానీ.. ఈ నలుగురు లెజెండ్స్ యుక్తవయస్సులో ఉన్నప్పుడు దిగిన ఫోటో అని మాత్రం తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య – చిరుల బాండింగ్ మాత్రం వేరే లెవెల్ అని కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. ఇదిరా.. ఒకప్పుడు టాలీవుడ్. ఇలా ఉండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.