Nandamuri Balakrishna: రాజకీయ నేతల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయా.. ఎదురెదురుగా ఎన్ని తిట్టుకున్నా.. బయట ప్రజల్లో ఉన్నప్పుడు పలకరించుకోవడం సంస్కారం. ఇక టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం అందరికి తెల్సిందే. తెల్లవారిన దగ్గరనుంచి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. చంద్రబాబు, సీఎం జగన్, నందమూరి బాలకృష్ణ, రోజా ఇలా ప్రతి ఒక్కరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నవారే.. అయితే రాజకీయంగా వీరి మధ్య గొడవలు ఉన్నా పర్సనల్ కలిసినప్పుడు వీరు పలకరించుకుంటూ ఉంటారు.
ఒకరి బర్త్ డే లకు ఒకరు విష్ చేసుకుంటూ ఉంటారు. ఇక తాజాగా కృష్ణ అంత్యక్రియల్లో ఒక రేర్ ఘటన చోరుచేసుకొంది. కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి మహేష్ ఇంటికి వచ్చిన జగన్.. అక్కడే ఉన్న బాలకృష్ణను పలకరించారు. అందరితో పాటు బాలయ్యకు కూడా నమస్కరించి బాగోగులు కనుక్కున్నారు. ఇక బాలయ్య సైతం జగన్ కు హయ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రాజకీయాల్లో ఎలా ఉన్నా.. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు కలిసి ఉండాలి అని నిరూపించిన ఈ ఇద్దరు నేతలను అభిమానులు ప్రశంసిస్తున్నారు.
మహేష్‌ను ఓదార్చి, పక్కనే ఉన్న బాలకృష్ణను పలకరించిన సీఎం జగన్..
FULL VIDEO – https://t.co/H77km8sbNa#CMYSJagan #SSKLivesOn #SuperStarKrishna #RIPLEGEND #RIPSuperStarKrishnaGaru #KrishnaGaru #MaheshBabu #NTVNews #NTVTelugu pic.twitter.com/cdKGLwS9sx
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) November 16, 2022
