Mahesh BAbu: ఏసియన్ నమ్రత గ్రూప్ నూతన రెస్టారెంట్ ‘ప్యాలెస్ హైట్స్’ బుధవారం గ్రాండ్ గా ప్రారంభమయ్యింది. మహేశ్ బాబు శ్రీమతి నమ్రత శిరోద్కర్ జ్యోతిప్రజ్వలన చేసి దీన్ని ప్రారంభించారు. ఏసియన్ గ్రూప్, మినర్వా గ్రూప్ కి చెందిన ‘మినర్వా కాఫీ షాప్’ ఇటీవలే ప్రారంభమైంది. ‘ప్యాలెస్ హైట్స్’, ‘మినర్వా కాఫీ షాప్’ రెండూ బంజారాహిల్స్ రోడ్ నెం. 12 లో వున్నాయి. అయితే ‘ప్యాలెస్ హైట్స్’ లగ్జరీ వసతులతో, అద్భుతమైన ఇంటీరియర్ తో రాయల్ డైనింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే రెస్టారెంట్. జాహ్నవీ నారంగ్, జేష్ఠ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, శిరీష్ తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Namrata Shirodkar: ఏసియన్ నమ్రత ‘ప్యాలెస్ హైట్స్’ రెస్టారెంట్ ప్రారంభం
Show comments