Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మరో కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు. ఇప్పటికే ఏషియన్ గ్రూప్స్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ ప్రారంభించిన మహేష్ ఇప్పుడు వారితో కలిసి ఫుడ్ బిజినెస్ లోకి దిగాడు. ఈ రెస్టారెంట్‌కు ఏఎన్ అని నామకరణం కూడా చేశారు. ఏ అంటే ఏషియన్స్ అండ్ ఎన్ అంటే నమ్రత అని తెలుస్తోంది. బంజారా హిల్స్‌లోని టీఆర్ఎస్ భవనం పక్కన ప్రమబించిన ఈ రెస్టారెంట్ లో మినర్వ కాఫీ షాప్ అండ్ ప్యాలెస్ హైట్స్ ను నేడు నమ్రత పూజా కార్యక్రమాలతో ఓపెన్ చేసింది.
రేపు ఈ హోటల్ గ్రాండ్ గా ఓపెన్ కానుంది. ఇక ఈ రెస్టారెంట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ రెస్టారెంట్ చూడడానికి ఎంతో అందంగా ఉంది. రేట్లు కూడా అందరికి అందుబాటులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపు గ్రాండ్ లాంచ్ కు మహేష్ అభిమానులు తరలివస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో ఉండడంతో రేపటి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కు హాజరుకాకపోవచ్చు. మహేష్ ఈ బిజినెస్ లో కూడా మంచిగా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.