NTV Telugu Site icon

Allu Arjun : అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌.. పుష్పరాజ్ సేఫ్

Alluarjun

Alluarjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్​ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో డిసెంబరు 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్​ను అరెస్ట్​ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించి విచారించారు.   వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించగా  అనంతరం అల్లు అర్జున్​ను చంచల్​గూడ జైలుకు తరలించారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్​ హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు గత నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Also Read : BSS : ‘బెల్లంబాబు’ బర్త్ డే.. 4 సినిమాల స్పెషల్ అప్డేట్స్

మధ్యంతర బెయిల్ ముగియడంతో సంధ్య థియేటర్ ఘటన పై నమోదైన కేసులో అల్లు అర్జున్ బెయిల్ పై ఉత్కంఠ  నెలకొంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించారు న్యాయవాదులు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టి వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. మొత్తం మీద ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఉత్కంఠ తెరదించుతూ  నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వులు జారీ చేస్తూ తీర్పు వెలువడిస్తూ ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు చేస్తూ, రూ. 50 వేల రూపాయల రెండు షూరిటీలు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం  చేయకూడదని,కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దని కీలక సూచనలు చేసింది న్యాయస్థానం.

Show comments