NTV Telugu Site icon

Namratha: హమ్మయ్య.. మా మహేష్ ను వదిలేశారా.. సంతోషం

Mahesh

Mahesh

Namratha: సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలిసినవి రెండే రెండు. ఒకటి సినిమా.. రెండు కుటుంబం. షూటింగ్స్, వెకేషన్స్.. ఇవి తప్ప మహేష్ కు బయట వ్యాపకాలు ఏమి లేవు. ఏడాదిలో ఖచ్చితంగా నాలుగుసార్లు అయినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్లకపోతే ఆయనకు ఏడాది గడిచినట్టే అనిపించదు. ఈ మధ్యనే కుటుంబంతో కలిసి మహేష్ వెకేషన్ కు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది మొదట్లో మొదలైన ఈ సినిమా మధ్య మధ్యలో బ్రేకులు వేస్తూ ముందుకు వెళ్తోంది. కృష్ణ మృతి వలన కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత మహేష్ కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్లారు.ఇన్నిరోజులు తరువాత ఈ మధ్యనే మహేష్ సెట్ లో అడుగుపెట్టాడు. ఇప్పుడప్పుడే త్రివిక్రమ్, మహేష్ ను వదిలేలా కనిపించడం లేదు. అందుకే ఈసారి వెకేషన్ ను కేవలం నమ్రత- సితారనే ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నారు.

Ajith: భార్యను వదిలి అజిత్ సీక్రెట్ ఎఫైర్.. ఎవరామె ?

తాజాగా నేడు ఎయిర్ పోర్ట్ లో సితార, నమ్రత సందడి చేసారు. వారు ఇద్దరు వెకేషన్ కు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. సితార నిన్ననే తన సెకండరీ స్కూల్ గ్రాడ్యుడేషన్ అందుకుంది. కూతురు ఎదుగుతున్న తీరుకు తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇక గౌతమ్.. విదేశాల్లోనే చదువుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో ఈ తల్లీకూతుళ్లు మాత్రమే వెకేషన్ కు వెళ్తున్నట్లు కనిపించారు. మహేష్ లేకుండా ఈ కుటుంబం బయటికి వెళ్లడం ఇదే మొదటిసారిగా కనిపిస్తోంది. మహేష్ షూటింగ్ లో బిజీగా ఉండడంవలనే నమ్రత, కూతురుతో పాటు వెళ్తుందట. అయితే అది కొడుకు దగ్గరకా.. లేక వేరే వెకేషన్ కా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ ఫోటో చూశాక అభిమానులు.. హమ్మయ్య.. మా మహేష్ ను వదిలేశారా.. సంతోషం. ఇప్పటికే షూటింగ్ లేట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ వెకేషన్ అంటే పదిరోజులు.. ఇలా అయితే సినిమా అయ్యేది ఎప్పుడు.. మీరు వెళ్ళండి.. మా అన్న షూటింగ్ చేసుకుంటాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments