ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’. తమిళ్ లో అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకి ఇది రీమేక్ వర్షన్. తెలుగులో ఇదే సినిమాని పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో లవ్, కామెడీ, కొంచెం యాక్షన్ ఉండే వీరమ్ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ కారణంగానే సల్మాన్ ఖాన్ హిందీలో ఈ మూవీని రీమేక్ చేస్తున్నట్లు ఉన్నాడు. ఈ ఈద్ కి రిలీజ్ అవ్వనున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేస్తూ ఈ మూవీ టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. పఠాన్ మూవీతో పాటు జనవరి 25న ముందుగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ టీజర్ మంచి ఫీడ్ బ్యాక్ ని తెచ్చుకుంది కానీ సల్మాన్ ఖాన్ లాంగ్ హెయిర్ లుక్స్ పై నెగటివ్ కామెంట్స్ వినిపించాయి.
ఓవరాల్ గా టీజర్ బాగుండడంతో సల్మాన్ ఖాన్ లుక్ పై వచ్చిన కామెంట్స్ ఫ్లోలో కొట్టుకొని పోయాయి. లేటెస్ట్ గా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘నయ్యో లగ్తా’ రిలీజ్ అయ్యింది. దాదాపు ఏడేళ్ల తర్వాత హిమేష్ రష్మియా, సల్మాన్ ఖాన్ సినిమాలో పాట పాడడం ఇదే మొదటిసారి. లడాఖ్ లోని ఎగ్జోటిక్ లోకేషన్స్ లో షూట్ చేసిన ఈ నయ్యో లగ్తా సాంగ్ వినడడానికి చూడడానికి చాలా బాగుంది. పూజా హెడ్గే ఎలిగెంట్ లుక్ ఆకట్టుకుంది. సాంగ్, విజువల్స్, పూజా హెడ్గే… ఇలా అన్నీ బాగానే ఉన్నాయి కానీ సల్మాన్ ఖాన్ లాంగ్ హెయిర్ మాత్రమే తేడా కొడుతుంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమానే కాబట్టి సల్మాన్ ఖాన్ ఆ లాంగ్ హెయిర్ లుక్ ని అవోయిడ్ చేసి ఉంటే బాగుండేది.
Naiyo lagda dil? Toh suno, #NaiyoLagda dil… https://t.co/CuMngAp7n7@hegdepooja @VenkyMama @farhad_samji #HimeshReshammiya #KamaalKhan @palakmuchhal3 @Musicshabbir @IamJagguBhai @bhumikachawlat @boxervijender #AbhimanyuSingh
— Salman Khan (@BeingSalmanKhan) February 12, 2023