Site icon NTV Telugu

అసభ్యకర సాంగ్ తో చిక్కుల్లో హనీ సింగ్

Honey-Singh

పాపులర్ సింగర్ హనీ సింగ్‌ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఒకప్పుడు తన అద్భుతమైన పాటలతో వార్తల్లో నిలిచిన ఈ యంగ్ పాప్ సింగర్ ఇప్పుడు మాత్రం కాంట్రవర్సీలతో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. హనీ సింగ్‌పై అసభ్యకరమైన పాటను పాడినందుకు,ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసినందుకు కేసు నమోదైంది. ఆనంద్‌పాల్ సింగ్ జబ్బాల్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా పంచ్‌పోలీ పోలీసులు సింగ్‌పై సెక్షన్ 292 (అశ్లీల కంటెంట్ విక్రయం, పంపిణీ), IPC, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఇతర సంబంధిత నిబంధనల కింద ఫిర్యాదు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా మహారాష్ట్ర, నాగ్‌పూర్‌లోని జిల్లా కోర్టు హనీ సింగ్ వాయిస్ శాంపిల్ ను సమర్పించడానికి స్థానిక పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలని ఆదేశించింది. ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 11 మధ్య నాగ్‌పూర్‌లోని పంచపావోలీ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని జిల్లా అదనపు సెషన్స్ జడ్జి SASM అలీ జనవరి 27న హనీ సింగ్ ను ఆదేశించారు.

Read Also : స్మగ్లింగ్ చేసి ‘తగ్గేదే లే’ అంటాడా ?… ‘పుష్ప’రాజ్ పై గరికపాటి ఫైర్

విదేశాలకు వెళ్లేందుకు తనకు విధించిన షరతును సడలించాలని కోరుతూ గాయకుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 29, ఫిబ్రవరి 4 మధ్య దుబాయ్ వెళ్లేందుకు సింగ్‌ను అనుమతించగా, ఫిబ్రవరి 4, 11 మధ్య పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు సింగర్ ను ఆదేశించింది. సింగ్ దరఖాస్తును దర్యాప్తు అధికారి వ్యతిరేకించారు. గాయకుడు జనవరి 25న పోలీసు స్టేషన్‌కు హాజరు కావాల్సి ఉందని, అయితే అతను హాజరు కాలేనంటూ ఈమెయిల్‌లో తెలియజేశాడని పేర్కొన్నాడు. గాయకుడు విచారణకు సహకరించడం లేదని, ఒకవేళ అతడిని ప్రయాణానికి అనుమతిస్తే కోర్టుకు హాజరు కాలేడని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు.

Exit mobile version