NTV Telugu Site icon

Naga Vamsi : చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు.. నాగవంశీ సెన్సేషనల్..

Nagavamshi 1

Nagavamshi 1

Naga Vamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ అప్పుడప్పుడు చేసే కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. తన సినిమాల కంటే కూడా ఆయన తన క్రేజీ ఆన్సర్లతోనే ఎక్కువగా పాపులర్ అవుతున్నాడు. వరుసగా హిట్లు అందుకుంటున్న ఈ ప్రొడ్యూసర్.. తాజాగా మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో రాబోతున్నాడు. మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మార్చి 28న రాబోతోంది. మూవీ ప్రమోషన్లలో నిర్మాత నాగవంశీ జోరుగా పాల్గొంటున్నాడు. తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసి చాలా విషయాలను పంచుకున్నాడు. ఇందులో ఓ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ఆయన సెటైరికల్ ఆన్సర్ ఇచ్చారు.

Robinhood : మీరు డబ్బుతో నన్ను కొనలేరు.. నితిన్ కు వెన్నెల కిషోర్ షాకింగ్ ఆన్సర్

నాగవంశీ స్పందిస్తూ.. ‘చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు. మీరే న్యాయం చేయాలి. మీడియా మా తరఫున మాట్లాడాలి’ అంటూ కౌంటర్ వేశారు. ఆయన ఉద్దేశంలో తనను గతంలో గుంటూరు కారం సినిమా టైమ్ లో హనుమాన్ సినిమాను తొక్కేస్తున్నారంటూ ఆయనపై ట్రోల్స్ వచ్చాయి. వాటిని ఉద్దేశించి ఇప్పుడు ఇలా తన వెర్షన్ లో చెప్పారన్న మాట. ఆయన చెప్పిన విధానాన్ని బట్టే ఏదో ఫన్నీగా అన్నారని అర్థం అవుతోంది. ప్రస్తుతం దిల్ రాజు ఎల్-2 సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఈ నెలాఖరుకు నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఉగాది పండుగ సందర్భంగా వస్తున్న ఈ సినిమాల్లో ఏది హిట్ అవుతుందో వేచి చూడాలి.