NTV Telugu Site icon

Guntur Kaaram: స్పైసీ సాంగ్.. మహేష్, శ్రీలీల చితక్కొట్టేశారు అంతే!

Guntur Kaaram Still

Guntur Kaaram Still

Nagavamsi Intresting tweet on Guntur Kaaram Movie Spicy song: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుని కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో ఈసారి వింటేజ్ మహేష్ ని చూడబోతున్నామని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోగా సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా 2024 జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Dil Raju: సంక్రాంతికి వెనక్కి తగ్గేది వారే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. అందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ధమ్ మసాలా సాంగ్ ని, ‘ఓ మై బేబీ’ అనే సాంగ్ ను రిలీజ్ చేయగా కొంత నెగటివ్ ట్రెండ్ కూడా అయింది. ఈ క్రమంలో థర్డ్ సింగిల్ విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ముందే జాగ్రత్త పడుతున్నారట మేకర్స్. అయితే ఆ సంగతి ఆలా ఉంచితే ఈ సినిమాలో ఒక మాస్ స్పైసీ సాంగ్ చేస్తున్నామని, మహేష్, శ్రీలీల చితక్కొట్టేశారు అంతే అంటూ నాగవంశీ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఆ సాంగ్ రషెష్ చూసి నాగవంశీ ఈ మేరకు కామెంట్స్ చేయడం గమనార్హం.

Show comments