NTV Telugu Site icon

Rangabali: పవన్ కళ్యాణ్ ను.. ఓ రేంజ్ లో దింపేశారయ్యా.. సూపర్.. సూపర్ .. సూపర్

Rangabali

Rangabali

Rangabali: యంగ్ హీరో నాగశౌర్య – యుక్తి తరేజా జంటగా పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం రంగబలి. SLV సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం.. నెవ్వర్ బిఫోర్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి షాక్ ఇస్తుంది. సినిమా ఎలా ఉంటుందో చెప్పలేం కానీ.. వీళ్ళు చేసే ప్రమోషన్స్ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇంటర్వ్యూ మొదలుపెట్టిన వెంటనే లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గొడవ పెట్టుకొని అభిమానులకు ప్రాంక్ అని చెప్పి షాక్ ఇచ్చారు. ఇక ఆ తరువాత సత్య.. జర్నలిస్టులను ఇమిటేట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఇక సత్య స్పూఫ్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది.

MayaBazaar For Sale: రియల్ మోసం.. అడ్డంగా ఇరుక్కున్న నవదీప్

ఇక తాజాగా శౌర్య మరో అద్భుతమైన ఫీట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో కలిసి.. పవన్ కళ్యాణ్ స్టెప్స్ ను రీ క్రియేట్ చేసి అదరగొట్టారు. జానీ చిత్రంలోని మారాజు గాకురామన్నయ్య సాంగ్ లో పవన్ స్టెప్స్ ను అలాగే దించేశారు. జానీ మాస్టర్ తో కలిసి నాగశౌర్య మనల్ని ఎవడ్రా ఆపేది అనే రేంజ్ లో అదరగొట్టేశాడు. జానీతో స్టెప్స్ వేయడానికి శౌర్య కొంచెం తడబడినా.. జానీ మాత్రం.. పవన్ లుక్ తో సహా అచ్చుగుద్దినట్లు దింపేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ప్రమోషన్స్ అని ఫలించి సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

Show comments