NTV Telugu Site icon

The Ghost : మ్యాజికల్… లొకేషన్ పిక్ షేర్ చేసిన డైరెక్టర్

Ghost

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిత్రబృందం దుబాయ్ లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసింది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ ను అక్కడ చిత్రీకరించారు. గ్రాండ్ విజువల్స్ తో, అద్భుతమైన లొకేషన్స్లో, అధునాతన సాంకేతికతతో లావిష్ గా గ్రాండ్ స్కేల్ లో సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్.

Read Also : Pudding and Mink Pub: డ్రగ్స్ తీసుకున్నవారికి షాక్.. త్వరలో నోటీసులు

ఈ సినిమా యాక్షన్ మూవీస్ ను ఇష్టపడే వారికి విజువల్ ఫీస్ట్ అవుతుంది అనిపించేలా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమాను చిత్రీకరిస్తున్న పలు లొకేషన్ల నుంచి మేకర్స్ పిక్స్ ను రిలీజ్ చేయగా, అవి వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. “ఊటీలో ఎప్పుడూ మ్యాజికల్ మార్నింగ్స్” అంటూ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఓ లొకేషన్ స్టిల్ ను షేర్ చేయడంతో ఇప్పుడు ‘ది ఘోస్ట్’ చిత్రీకరణ ఊటీలో జరుగుతోందని స్పష్టమైంది. త్వరలోనే ఈ సినిమా అక్కినేని అభిమానులను థియేటర్లలో అలరించనుంది.

Show comments