Site icon NTV Telugu

Nagarjuna : కుబేరలో నాదే మెయిన్ రోల్.. నాగార్జున కామెంట్స్

Kubera

Kubera

Nagarjuna : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో నాగార్జున, ధనుష్ కీలక పాత్రలు చేశారు. ఇందులో ఎవరిది మెయిన్ రోల్ అనే దాని గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. కొందరేమో ధనుష్ ది మెయిన్ రోల్ అని.. ఆయన పర్ఫార్మెన్స్ కీలకం అంటున్నారు. ఇంకొందరేమో నాగార్జునదే మెయిన్ రోల్ అనేస్తున్నారు. కొందరేమో తెలుగులోనే ఎక్కువ మార్కెట్ జరిగింది. ఇక్కడే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇదంతా నాగార్జున వల్లే అంటున్నారు. తాజాగా మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

Read Also : Krithi Shetty : టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పిన కృతి శెట్టి..?

ఇందులో నాగార్జున మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల సినిమాలు అన్నీ సక్సెస్ అవుతుంటాయి. ఆయన సినిమా తీస్తే సక్సెస్ మీట్ పెట్టాల్సిందే. రొటీన్ పాత్రలతో బోర్ కొడుతున్న టైమ్ లో డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చాడు శేఖర్. మేమిద్దరం సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ సినిమాతో కుదిరింది. నాకు ఈ పాత్ర గురించి మొదట చెప్పినప్పుడు నాదే మెయిన్ రోల్ అనిపించింది.

ఎందుకంటే అన్ని పాత్రలు నా పాత్రతోనే లింక్ అయి ఉంటాయి. సినిమా కథకు నా పాత్ర చేసే పనులే కీలకం. కాబట్టి ఈ సినిమాలో నాదే కీలక పాత్ర అని అనుకుని మూవీ చేశాను. ఇప్పుడు నా పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు శేఖర్ కు స్పెషల్ థాంక్స్. మేమిద్దరం భవిష్యత్ లో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు నాగార్జున.

Read Also : Lavanya Tripathi : ‘సతీ లీలావతి’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..!

Exit mobile version