Nagarjuna Says Good Bye To Bigg Boss: నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 6 ముగిసింది. ఆదివారం ఈ షో ఫైనల్ ఎపిసోడ్ పూర్తయి రేవంత్ విజేతగా నిలిచాడు. అయితే ఈ షోను నాగార్జున ముగించిన తీరు ఇకపై ఆయన బిగ్ బాస్ కి హోస్ట్ గా చేయకపోవచ్చనే అనుమానాలను రేకెత్తించింది. విన్నర్, రన్నరప్ ప్రసంగాలను ముగించిన తర్వాత, నాగార్జున సీజన్‌ను ముగించే ముందు ఈ షో గురించి, దానికి వచ్చిన స్పందన గురించి చెబుతుంటారు. అయితే నిన్న రాత్రి, రేవంత్ ను విజేత అని చివరలో మరోసారి ప్రకటించి ఆ తర్వాత సింపుల్ గా ‘ఇదంతా మీ గౌరవం, గుడ్ నైట్’ అని అనేశాడు.
అదే గత సీజన్స్ ను గమనిస్తే ‘ఈ వంద రోజులు అద్భుతమైన ప్రయాణం. ముగించే సమయం వచ్చింది. అయితే త్వరలో మళ్ళీ కలుద్దాం. మీ నాగార్జున’ అని చెబుతుండేవారు. ఈసారి మాత్రం త్వరలో కలుద్దాం అని కానీ మళ్లీ కలుద్దామని కానీ చెప్పకపోవడంతో ఇదే ఆయన హోస్ట్ గా చేసే చివరి సీజన్ అనే అభిప్రాయం కలుగుతోంది. నిజానికి ఈ సీజన్ లో ఈ షోకి దారుణమైన రేటింగ్స్ రావటం ఆయనను బాగా కలవరపరిచింది. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా గత సీజన్స్ లో నాగార్జున వచ్చిన వీకెండ్స్ రేటింగ్స్ బాగా ఉండేవి. మొత్తం మీద రమారమి చక్కటి రేటింగ్స్ తో షో పాస్ అయిపోయింది. ఈ సీజన్ 6 మాత్రం అనూహ్యంగా దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. నాగార్జున వచ్చిన వీకెండ్స్ లో కూడా ఎలాంటి ఇంప్రూవ్ మెంట్ లేకపోవడంతో తెలుగులో ఇక ఇదే లాస్ట్ సీజన్ అనే టాక్ సోషల్ మీడియాలో జరుగుతోంది.
బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేని పోటీదారులను ఎంపిక చేయటం కూడా ఈ షో పతనావస్థకు ప్రధాన కారణం. దీనికి తోడు అటు కెరీర్ పరంగానూ సక్సెస్ లు లేకపోవడంతో దానిపై పూర్తి స్థాయిలో దృష్టపెట్టాలని నాగ్ భావిస్తున్నాడట. ఏది ఏమైనా నాగార్జున లేకుండా, తెలిసిన కంటెస్టెంట్స్ లేకుండా ఈ షో తదుపరి సీజన్ మనుగడ ఎంతో కష్టమన్నది చూస్తున్నవారి కామెంట్. మరి ‘బిగ్ బాస్ షో’ నిర్వాహకులు ఏం చేస్తారన్నది చూడాలి.