Site icon NTV Telugu

Nagarjuna : భారీ బడ్జెట్ కాదు.. ప్రేక్షకులు మెచ్చినవే పాన్ ఇండియా మూవీలు..

Nagarjuna

Nagarjuna

Nagarjuna : కింగ్ నాగార్జున, ధనుష్ కాంబోలో వచ్చిన మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నాగార్జున, ధనుష్ పర్ఫార్మెన్స్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సినిమాలో నటించాలంటే చాలా లోతుగా ఆలోచించాలి. శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన మూవీ ఇది. ఈ మూవీ హిట్ అయిన సందర్భంగా నాగార్జున చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

read also : Anchor Shyamala: పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపించారా?.. ప్లకార్డ్ ప్రదర్శించిన శ్యామల!

భారీ బడ్జెట్ తో తీసినవి పాన్ ఇండియా సినిమాలు కావని.. ప్రేక్షకులు మెచ్చినవే పాన్ ఇండియా మూవీలు అంటూ ఆయన తేల్చేశారు. కుబేర మూవీని పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేశారు. నాగార్జున నటించిన మొదటి పాన్ ఇండియన్ మూవీ ఇదే కాబోలు. మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా.. అంతకు మించి కలెక్షన్లు సాధించేలా కనిపిస్తోంది.

కుబేర మూవీ బలమైన ఎమోషన్, డబ్బు చుట్టూ తిరగడంతో ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయిపోయింది. మరోసారి శేఖర్ కమ్ముల మ్యాజిక్ చేశారనే చెప్పుకోవాలి. నాగార్జున ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ను సంపాదించుకుంటాడనే అనిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత నాగార్జున నుంచి సాలీడ్ హిట్ వచ్చేసింది.

read also : RajaSaab : ప్రభాస్‌ సినిమా ‘రాజాసాబ్‌’ టీజర్‌ లీక్‌పై ఫిర్యాదు.

Exit mobile version