NTV Telugu Site icon

NBK 50 in TFI: ఆయన కూడా వచ్చి ఉంటే ఫ్రేమ్ నిండుగా ఉండేది మాష్టారూ!!

Balayya 50 Years

Balayya 50 Years

Bala Krishna’s 50 years golden jubliee celebrations : నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు అంటూ హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరిపారు. మెగాస్టార్ చిరంజీవి సహా శివ రాజ్ కుమార్, వెంకటేష్ సహా ఎంతో మంది కుర్ర హీరోలు హాజరైన ఈ వేడుక చాలా ఘనంగా జరిగింది. వేదిక మొత్తం అతిథులతో నిండిపోతే ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోయి చాలా గ్రాండ్ గానే జరిగింది. ఒకపక్క భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా అతిథులతో పాటు అభిమానులు కూడా హాజరయ్యారు. అయితే వేడుక చివరలో రిలీజ్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అదేమంటే ఒకే ఫ్రేమ్లో బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ కనిపించారు అయితే నాగార్జున కూడా ఈ వేడుకకు హాజరై ఉంటే ఆ ఫ్రేమ్ మరింత నిండుగా ఉండేదని వాదన వినిపిస్తోంది. అయితే నిజానికి మరొక పక్క నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కూడా నిన్నటి నుంచే ప్రారంభమైంది.

Tollywood: పెద్ద నిర్మాతలు.. చిన్న సినిమాలు.. ఏంటీ గందరగోళం?

ప్రారంభోత్సవ ఎపిసోడ్ కొంతవరకు శనివారం షూట్ చేసినా నిన్న నాగార్జున కచ్చితంగా స్టూడియోలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కావాలనుకుంటే ఒక అరగంట గ్యాప్ తీసుకుని వచ్చి కనిపించి వెళ్ళవచ్చు. కానీ ఆయన బిగ్ బాస్ కి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్- ఏఎన్నార్ల సమయంలో రెండు కుటుంబాల మధ్య చిన్న చిన్న పొరపాచ్చాలు ఉండేవి. కానీ స్నేహం మాత్రం గట్టిగానే ఉండేది. బాలకృష్ణ నాగార్జున కూడా మొదట్లో బాగానే ఉండేవాళ్ళు. అయితే రాను రాను కాస్త గ్యాప్ కనిపిస్తూ వస్తోంది. మధ్యలో బాలకృష్ణ అక్కినేని తొక్కినేని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ గ్యాప్ ని మరింత పెంచిందని చెప్పవచ్చు. ఈ వేడుకకు రావాలని నాగార్జునను కూడా ఆహ్వానించారు. అఖిల్ కూడా ఈ వేడుకకు హాజరయ్యే అతిధుల జాబితాలో ఉంది కానీ అటు నాగార్జున రాలేదు సరి కదా కుమారుడు అఖిల్ కూడా హాజరు కాలేదు. అయితే ఇదే వేడుకకు రావాల్సిన కమల్ హాసన్ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు సారీ చెబుతూ ఒక వీడియో బైట్ పంపించాడు. నాగార్జున అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. మొత్తం మీద నాగార్జున హాజరు కాకపోవడం మీద మాత్రం చర్చలు జరుగుతున్నాయి ఆ ఫ్రేమ్ నాగార్జునతో సంపూర్ణం అయ్యేదని భావిస్తున్నారు.

Show comments