Nagarjuna: బర్త్‌డే వేళ నాగార్జున ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna: అక్కినేని నాగార్జున అభిమానులకు ఆగస్టు 29 ఎంతో ప్రత్యేకమైన రోజు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో పాటు, ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా గురించి కీలక అప్డేట్ వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు కూడా. ‘కింగ్ 100’పై ఫస్ట్ గ్లింప్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. ఓటీటీ నుంచి మాత్రం నాగార్జునకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. ఆయన నటించిన ‘మన్మథుడు 2’ త్వరలో నెట్‌ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనుంది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకునే వారికి డెడ్‌లైన్ కూడా ఫిక్స్ అయిపోయింది.
నాగార్జున హీరోగా 2019లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ‘మన్మథుడు 2’. 2002లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ మూవీకి రిలీజ్ ముందు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. ఇప్పుడు కొన్నేళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి వార్తల్లోకి రావడానికి కారణం నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగిపోవడమే.
Also Read
- Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
- Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
- Om Chapter 1: ధనుష్ ‘ఓం' మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
- Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ‘మన్మథుడు 2’ 2026 సెప్టెంబర్ 22 నుంచి తొలగిపోనుంది. అంటే ఈ సినిమా చూడని ప్రేక్షకులు, ముఖ్యంగా నాగార్జున అభిమానులు, సెప్టెంబర్ 22లోపు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాను చూసేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ సినిమా అదే ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుందనే హామీ లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల స్ట్రీమింగ్ హక్కులు, లైసెన్స్ కాలపరిమితి ఆధారంగా ఇలాంటి మార్పులు సాధారణంగానే జరుగుతుంటాయి.
‘మన్మథుడు 2’ కి నటుడిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో సమంతా రూత్ ప్రభు, కీర్తి సురేష్ అతిథి పాత్రల్లో కూడా కనిపించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ మూవీని నిర్మించారు. నాగార్జున కెరీర్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ‘మన్మథుడు’ సినిమాకు ‘మన్మథుడు 2’ సీక్వెల్ కావడంతో ప్రేక్షకులు అదే స్థాయి ఎంటర్టైన్మెంట్ ను ఆశించారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
ఇక ప్రస్తుతం అందరి దృష్టి నాగార్జున 100వ సినిమాపైనే ఉంది. ‘కింగ్ 100’గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జున విభిన్న గెటప్ లలో కనిపించనున్నారని, తండ్రీకూతుళ్ల అనుబంధంతో కథ సాగుతుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. టబు సహా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో ఇందులో నటిస్తున్నారు.
ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ 100వ సినిమాకు సంబంధించిన ఆఫీషియల్ అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘మన్మథుడు 2’కు నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 22 చివరి తేదీ కావడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కొత్త ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ.. మరోవైపు పాత సీక్వెల్ ఓటీటీ నుంచి వీడ్కోలు పలకడం.. నాగార్జున అభిమానులకు ఈ ఆగస్టు, సెప్టెంబర్ నెలలు సినిమాల పరంగా మరింత ప్రత్యేకంగా మారుతున్నాయి.
తాజావార్తలు
-
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!