NTV Telugu Site icon

Nagarjuna: మా నాగ్ బంగారం రా.. ఆ ఫ్యాన్ ను కలిసి ఫొటో ఇచ్చాడు!

Nagarjuna Fan

Nagarjuna Fan

Nagarjuna Hugged Handicapped Fan Who Pushed By His Bodyguard At Mumbai Airport : స్టార్ హీరో నాగార్జున జూన్ 26న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన బాడీ గార్డ్ నెట్టివేసిన అభిమానిని కలిశాడు. దివ్యాంగుడైన అభిమానిని కలవడమే కాకుండా ఒక హగ్గు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆ అభిమాని ఆనందం మీరు చూడాల్సిందే చూడాల్సిందే. ఇటీవల నాగార్జునకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అందులో ఈ అభిమాని నాగార్జునను ఎయిర్పోర్టులో కలవాలనుకున్నాడు, అయితే నటుడి బాడీ గార్డ్ అతన్ని దారుణంగా పక్కకు నెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన వెంటనే, నాగార్జునపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. నాగార్జున వెంటనే క్షమాపణలు చెబుతూ భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగదని చెబుతూ ట్వీట్ చేశారు.

Darshan: ‘రేణుకాస్వామిని హీరోగా చేయడం ఆపండి’: దర్శన్‌కు మద్దతుగా యాంకర్ సంచలన ప్రకటన!

ఇక ఈరోజు దివ్యాంగుడైన అభిమానిని చూసిన నాగార్జున వెంటనే కౌగిలించుకోవడం తాజా వైరల్ వీడియోలో చూడవచ్చు. అతనితో ఫోటోలు కూడా తీసుకున్నారు. ఈ సమయంలో, అభిమాని కూడా చేతులు జోడించి నాగ్ కి క్షమాపణలు చెప్పాడు. బహుశా తన వల్ల నాగార్జునకి ఇంత ఇబ్బంది వతుందని అతను కూడా ఊహించి ఉండడు. అయితే అంతా బాగానే ఉందని ఎలాంటి ఇబ్బంది లేదని నాగ్ సంతోషంగా ఓదార్చాడు! రెండు రోజుల క్రితం నాగార్జున, ధనుష్ అలాగే అతని కొడుకు ముంబై విమానాశ్రయంలో కనిపించారు. వీరి భద్రత కోసం చుట్టూ చాలా మంది బాడీ గార్డులు ఉన్నారు. అప్పుడు ఒక వికలాంగ అభిమాని అకస్మాత్తుగా నాగార్జున దగ్గరికి వచ్చాడు, అతన్ని బాడీ గార్డు లాగి అవతలి వైపుకు నెట్టాడు. అతను బలంగా నెట్టడంతో వికలాంగుడైన ఫ్యాన్ దాదాపు కింద పడిపోయేవాడు. ఇక ఈ వీడియో చూసిన జనాలు.. ఆ అభిమానికి ఏమైందో చూసేందుకు కూడా నాగార్జున పట్టించుకోలేదని మండిపడ్డారు. ధనుష్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేదని ఆయన్ని కూడా విమర్శించారు. అయితే సోషల్ మీడియాలో నాగార్జున టార్గెట్‌గా మారాడు.

Show comments