Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారు. అతి త్వరలో జరగనున్న తన చిన్న కొడుకు అఖిల్ పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు. రేవంత్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. నాగార్జున వెంట అమల కూడా ఉన్నారు. అఖిల్, జైనబ్ రవ్జీతో కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ లో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జూన్ 6న వీరిద్దరి పెళ్లి వేడుక ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.
Read Also : Chiranjeevi : చిరంజీవి, అనీల్ ప్రాజెక్ట్ షూటింగ్ అప్‌డేట్..!
