Site icon NTV Telugu

Nagarjuna 100 Film: పుట్టినరోజున మైల్‌స్టోన్ మూవీ అనౌన్స్‌మెంట్‌.. నాగ్ లుక్‌ కూడా సిద్ధం?

Nagarjuna 100 Film

Nagarjuna 100 Film

Is King 100 Poster Ready for Nagarjuna Akkineni Birthday: తన కో స్టార్ట్స్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే.. కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. 2022లో వచ్చిన బంగార్రాజు తర్వాత నాగ్ పెద్దగా హిట్ చూడలేదు. బ్రహ్మాస్త హిట్ అయినప్పటికీ అది రణబీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టగా.. నా సామి రంగా పర్లేదనిపంచింది. కింగ్ హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి.. సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్‌కు షిఫ్టయ్యారు.

నాగార్జున ఇటీవలే ధనుష్ ‘కుబేర’తో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘కూలీ’తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ విలన్‌గా నటించారు. అయితే కింగ్ కొత్త సినిమా విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ ఇప్పటికే నాగ్ కొత్త సినిమాపై గట్టిగా కసరత్తులు చేస్తున్నారు. ఈసారి ఆయన తమిళ దర్శకుడితో మైల్‌స్టోన్ మూవీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ‘రా.కార్తీక్‌’ దర్శకత్వంలో నాగార్జున సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ‘కింగ్‌ 100’ వర్కింగ్‌ టైటిల్‌తో మొదలు పెట్టబోతున్నారు.

Also Read: Film Federation President: మేం చర్చలకు సిద్ధం.. నిర్మాతలే నాన్చుతున్నారు! పెండింగ్‌లో 13 కోట్లు

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రాన్ని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 29న ప్రకటించనున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే ఓ లుక్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను నాగ్ తమ సంస్థలోనే స్వయంగా నిర్మించనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని సమాచారం. మరి ఈసారి కింగ్ ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తారో చూడాలి.

Exit mobile version