NTV Telugu Site icon

Jayamma Panchayathi Pre Release Event : రంగంలోకి ఇద్దరు స్టార్ హీరోలు

Jayamma Panchayathi

Jayamma Panchayathi

పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ “జయమ్మ పంచాయితీ” విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సుమ మూవీకి స్టార్ సపోర్ట్ బాగా లభిస్తోంది. ఇంతకుముందు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకోగా, మరో ఇద్దరు స్టార్ హీరోలు సుమ కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ చిత్రం మే 6న విడుదలకు సిద్ధమవుతుండగా, ఈరోజు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ మేరకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతుండగా, గెస్టుల పేర్లు రివీల్ చేశారు. “జయమ్మ పంచాయతీ”కి నాగార్జున, నాని హాజరు కాబోతున్నారు.

Read Also : Mega154 : టైటిల్ లీక్ చేసిన మెగాస్టార్

ఇక ఇప్పటికే విడుదలైన “జయమ్మ పంచాయతీ” టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఈ మూవీని వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించారు. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్న విలేజ్‌ డ్రామా ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Jayamma Panchayathi Movie Pre Release Event LIVE | Suma Kanakala | M. M. Keeravani | NTV Ent LIVE