King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King 100: నాగార్జున అక్కినేని కెరీర్లో 100వ సినిమా కోసం అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ 100వ సినిమాకి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి టబు పవర్ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున-టబు కాంబినేషన్ రిపీట్ అవుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, మరియు విజయేంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే నెలలుగా షూటింగ్ జరుగుతున్నా, సినిమా నుంచి ఒక్క లుక్ కూడా బయటకు రాకపోవడంతో ప్రాజెక్ట్ చుట్టూ సస్పెన్స్ మరింత పెరిగింది.
నాగార్జున నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గత కొన్ని నెలలుగా షూటింగ్ కొనసాగుతున్నప్పటికీ, నిర్మాతలు మాత్రం సినిమా గురించి పెద్దగా వివరాలు బయటకు వెల్లడించలేదు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు వరుసగా పోస్టర్లు, ఫస్ట్ లుక్స్, టీజర్లు విడుదల చేస్తుంటారు. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క ఆఫీషియల్ లుక్ కూడా విడుదల చేయకపోవడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఇప్పుడు ఈ ఎదురుచూపులకు ఆగస్టు 29న తెరపడనుంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమా టైటిల్‌తో పాటు ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఈ మూవీకి సంబంధించి పబ్లిసిటీ స్టంట్స్ మాత్రం నాగ్ పుట్టినరోజునుంచే ప్రారంభం కానున్నాయి.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
నాగార్జున కెరీర్లో ఇది 100వ చిత్రం కావడంతో, సినిమాకు సంబంధించిన ప్రతి అంశంపైనా అభిమానుల దృష్టి ఉంది. కథ ఎలా ఉంటుంది, నాగార్జునను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారు, ఆయనతో పాటు నటించే ఇతర నటీనటులు ఎవరు అనే విషయాలపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. నిర్మాతలు ఇప్పటివరకు ఈ అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆగస్టు 29న వచ్చే గ్లింప్స్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ ప్రాజెక్ట్‌కు తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పలువురు తెలుగు దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ చివరకు ఆర్. కార్తీక్‌ను ఎంపిక చేయడం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది.
మరోవైపు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక సినిమా నుంచి వరుసగా ప్రమోషనల్ కంటెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి చిత్ర యూనిట్ ‘నెక్ట్స్ లెవెల్’ (Next Level) అనే పవర్ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా (ఆగస్టు 29న) ఈ సినిమా టైటిల్‌ను ఆఫీషియల్ గా ప్రకటించనున్నారు. ఇప్పటివరకు గోప్యత పాటించిన చిత్రబృందం ఒక్కసారిగా టైటిల్, ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తే సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశముంది. నాగార్జున కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నప్పటికీ, 100వ సినిమా మాత్రం ప్రత్యేకమైన మైలురాయిగా నిలవనుంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఉన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు 29న విడుదలయ్యే గ్లింప్స్ ద్వారా నాగార్జున 100వ చిత్రంగా ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!