Akkineni Naga Chaitanya: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం జనవరి 3న రిజిస్టర్ పద్దతిలో సింపుల్ గా జరిగిన విషయం తెల్సిందే. ఇక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐరా ఖాన్, నూపుర్ శిఖరే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గత వారం ఉదయ్‌పూర్‌లో ముంబైలో రిజిస్టర్డ్ పద్ధతిలో వివాహం చేసుకున్న తరువాత వారిద్దరూ జీవితాంతం ఒకరికొకరు మద్దతు ఇస్తామని క్రైస్తవ పద్దతిలో వాగ్దానం చేసుకున్నారు. ఐరా, నుపుర్ సెప్టెంబర్ 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఐరా అమీర్, అతని మొదటి భార్య రీనా దత్తా కుమార్తె. నుపుర్ శిఖర్ ఫిట్‌నెస్ ట్రైనర్. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ శిక్షణ ఇచ్చాడు. ఇక వీరు ఇంటికి తిరిగొచ్చాక పరిశ్రమలోని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ ముంబైలో రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం హాజరు అయ్యారు.
సల్మాన్ ఖాన్‌తో పాటు రణబీర్ కపూర్, అనిల్ కపూర్, సిద్దార్థ్, మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్, ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ జంట నలుపు రంగు దుస్తుల్లో కనిపించగా,జోయా అక్తర్‌తో వారు కలిసి పోజులిచ్చారు. డ్రీమ్ గర్ల్ హేమ మాలిని తన కుమార్తె ఈషా డియోల్‌తో కనిపించారు. వారిద్దరూ అద్భుతంగా కనిపించారు. ఖయామత్ సే ఖయామత్ తక్ తో అమీర్ మొదటి సహనటి జూహీ చావ్లా భర్త జై మెహతాతో కలిసి కనిపించారు. ఇక ఈ రిసెప్షన్ మొత్తంలో హైలైట్ గా నిలిచింది యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. అమీర్ ఖాన్, నాగ చైతన్య కలిసి లా సింగ్ చద్దా సినిమాలో నటించారు. ఆ స్నేహబంధంతోనే అమీర్, చై కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఇక ఈ రిసెప్షన్ లో చై బ్లాక్ నద్ బ్లాక్ సూట్ లో అదరగొట్టాడు. ఇక చై నటిస్తున్న తండేల్ లుక్ లోనే కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
