Site icon NTV Telugu

Naga Chaitanya : నాగచైతన్య, శోభిత దీపావళి సెలబ్రేషన్స్.. పిక్స్ చూశారా

Naga Chaitanya

Naga Chaitanya

Naga Chaitanya : నాగచైతన్య, శోభిత ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి అయ్యాక వీరిద్దరూ సెపరేట్ గా ఓ ఇల్లు తీసుకుని అందులో ఉంటున్నారు. ప్రతి పండుగకు వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా వీరిద్దరూ మరోసారి ట్రెడిషనల్ బట్టల్లో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నాగచైతన్య చాలా స్టైలిష్ గా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత చైతూ హెయిర్ స్టైల్ లో కనిపించాడు. కుర్తా వేసుకుని చాలా పద్ధతిగా ఉన్నాడు. అటు శోభిత కూడా డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ ఈ ఫొటోలను తెగ షేర్ చేసేస్తున్నారు.

Read Also : Tharun Bhaskar : రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్.. ఏదో జరుగుతోందిగా..

నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండుతో భారీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పనులు ప్రస్తుతం స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ మూవీ కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్లు కూడా వేస్తున్నారు. అయితే నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. తనకు శోభిత కూడా సినిమాల పరంగా హెల్ప్ చేస్తోందని చెబుతున్నాడు. అందుకే ఈ విషయంలో నాగచైతన్య సో లక్కీ అనేస్తున్నారు అభిమానులు. అటు శోభిత కూడా తమిళ డైరెక్టర్ పా రంజిత్ సినిమాలో నటిస్తోంది. ఆ మూవీ కోసం లుక్ ను మార్చుకునేందుకు రెడీ అవుతోంది. పెళ్లి తర్వాత సినిమాలు ఆపేస్తుందని అంతా అనుకున్నా.. ఈ సినిమాతో అవన్నీ ఫేక్ అని తేలిపోయాయి.

Read Also : Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 మరో రికార్డు..

Exit mobile version