Nagababu: చిరంజీవి- గరికపాటి గొడవ రోజురోజుకు ముదురుతోంది. చిరుపై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేయడం పద్దతి కాదని, చిరుకు ఆయన క్షమాపణ చెప్పాలని మెగా ఫ్యాన్స్ ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో గరికపాటి, చిరును స్వయంగా కలిసి క్షమాపణలు కోరుతానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్తపై నాగబాబు స్పందించాడు. నిన్నటికి నిన్న గరికపాటికి చిరు అంటే అసూయ అని చెప్పుకొచ్చి ఆ వివాదాన్ని ఇంకాస్తా పెద్దది చేశాడు. దీంతో ప్రతి ఒక్కరు గరికపాటిని ఏకిపారేస్తున్నారు. మీరు ఇలా చేస్తారనుకోలేదు.. పెద్దవారు మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే నాగబాబు మరోసారి ఈ విషయమై ట్వీట్ చేసి షాక్ ఇచ్చాడు. గరికపాటి క్షమాపణలు తమకు అవసరం లేదని చెప్పుకొచ్చాడు.
“గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా రిక్వెస్ట్”అని చెప్పుకొచ్చారు. మరి ఈ వివాదాన్ని మెగా అభిమానులు మర్చిపోతారా..? లేదా..? అనేది చూడాలి.
