Nagababu Counter to Ram Gopal Varma Again: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా రిలీజ్ నేపథ్యంలో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తా అని ఆయన అనౌన్స్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై జనసేన నేత నాగబాబు వర్మపై సెటైర్ వేశారు. వర్మ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నా, వర్మ మీరేం భయపడకండి మీ జీవితానికి ఏ డోకా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో..ఆ మాటకొస్తే ఇండియా లో ఏ పనికిమాలిన ఎదవ మీకెటువంటి హాని తల పెట్టడు అని పేర్కొన్నారు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా.. మీరేం వర్రీ అవకండి కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి…ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి” అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టగా దానికి నాగబాబుకి వర్మ కౌంటర్ ఇచ్చాడు.
SSMB 29: రెస్ట్ మోడ్ అయింది.. పని మొదలెట్టిన జక్కన్న
ఆ పోస్ట్ ను షేర్ చేస్తూ “సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే, నా సినిమాలో మీరు, మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఇప్పుడు దానికి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. వర్మ, మీరు నా పోస్ట్ కి స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది, కొంచెం షాక్ కి కూడా గురయ్యా, ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్లు దాటింది, ఇంకా బతికున్నాను అనుకుని తిరుగుతున్నారు కానీ మీ ఆత్మ మాత్రమే తిరుగుతోంది అది గ్రహించాలి మీరు, Any how ఏదో ఓక రూపం లో నా పోస్ట్ కి Answer ఇచ్చినందుకు సంతోషం, ఎప్పటికి మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా, కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆయన రాసుకొచ్చాడు. దీనికి వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి మరి.