Site icon NTV Telugu

Nagababu: మంచి కోసం సినిమాలు తీసే గొప్పవాళ్ళు లేరిక్కడ.. అంతా వ్యాపారమే

Nagababu

Nagababu

Nagababu:మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసుకు ఏది అనిపిస్తే అది బయటికి చెప్పేస్తాడు. ముఖ్యంగా తన చిరంజీవి ని కానీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే వాళ్లు ఎంతటి వాళ్లైనా అసలు వదిలిపెట్టడు. జనసేన పార్టీలో క్రియాశీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న నాగబాబు పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. ఇక ట్విట్టర్ లో అయితే నాగబాబు చేసే వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఈ మధ్య సినిమాలను చూసి ప్రజలు చెడిపోతున్నారు అని కొందరు అన్న మాటలపై నాగబాబు స్పందించాడు.

Suriya: సూర్య- జ్యోతిక కూతురిని చూశారా.. హీరోయిన్ లా ఉందే

” సినిమాల్లో చూపించే వైలెన్స్ వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే,మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా. ఒక ఫిల్మ్ మేకర్ గా ఒకటి నిజం,సినిమాలు ఎంటర్ టైన్మెంట్ కోసమే, జనాన్ని బాగు చెయ్యటం కోసమో చెడగొట్టాడని కోసమో తీసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ. ఇది కేవలం వ్యాపారం. సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది ఆన్సర్.సినిమాల్లో ఏదన్నా ఓవర్ గా ఉంటే సెన్సార్ వుంది. కుహనా మేధావులు ఏడవకండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో వైలెన్స్ ఉంది అంటే.. దాన్ని సెన్సార్ చూసాకనే బయటకి వచ్చింది. అది కూడా తెలియదా..? ఏవి కట్ చేయాలో.. వారికి తెలుసు.. ఇక ఏడవకండి అంటూ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. మరి ఇందుకు సమాధానం ఎవరి నుంచో వస్తుందో చూడాలి.

Exit mobile version