NTV Telugu Site icon

Naga Vamsi: సినిమా హిట్ కాకుంటే ఉంటది అసలు మ్యూజిక్!

Nagavamsi

Nagavamsi

Naga Vamsi Tweets about Social Media Trolling goes viral: సోషల్ మీడియాలో తెలుగు సినీ హీరోల అభిమానులకు, నిర్మాతలకు ఇతర టెక్నీషియన్లకు మధ్య పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే గుంటూరు కారం సినిమా నుంచి తాజాగా ఒక పాట విడుదలైంది. ఆ పాట దారుణంగా ఉందంటూ మహేష్ అభిమానులు లిరిక్స్ రాసిన రామ జోగయ్య శాస్త్రిని టార్గెట్ చేయడంతో ఆయన కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు శాస్త్రికి అండగా నిలబడుతూ గుంటూరు కారం సినిమా నిర్మాత నాగ వంశీ ఘాటుగా స్పందించాడు. గుంటూరు కారం సినిమా విషయంలో మొదటి నుంచి కాస్త హైపర్ యాక్టివ్ గా ఉన్న నాగ వంశీ యానిమల్ సినిమాలోని ఎండ్ సీన్ ని పోస్ట్ చేసి ట్రోలింగ్ చేసే వారిని సైలెంట్ గా ఉండమని చెప్పఁడం చర్చనీయాంశం అయింది. మేము ఏమి చేస్తున్నామో మాకు తెలుసు, జనవరి 12న కలుస్తాం అంటూ ట్వీట్ చేయడం వరకు బాగానే ఉంది కానీ ఈ సీన్ ని పోస్ట్ చేయడం మరీ ఓవర్ గా ఉంది. ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఉండి తమ సినిమాలకు కోట్లకు కోట్లు కలెక్షన్లు తెచ్చిపెట్టే మహేష్ బాబు ఫ్యాన్స్ మీద నాగ వంశీ ట్వీట్ చేయడంతో వారంతా ఆయనపై సీరియస్ గా ఉన్నారు.

Sarkaru Naukari: జనవరి 1న సింగర్ సునీత కొడుకు హీరోగా సర్కారు నౌకరీ!

మరింత ట్రోలింగ్ జరుగుతూ ఉండడంతో నాగ వంశీ మరోసారి స్పందిస్తూ ఒక నిర్మాతగా నేను ఇచ్చిన రిప్లై మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు కానీ ఇప్పుడైనా అర్థం చేసుకోండి మా టీం మేట్స్ ని టార్గెట్ చేసి వారిని పర్సనల్గా తిడుతుంటే వాళ్ళ పని చేయకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాటిని చూసి మేమెంత బాధపడుతున్నామో అంటూ ఆయన రాసుకొచ్చాడు. పర్సనల్గా టార్గెట్ చేయకుండా బూతులు మాట్లాడకుండా ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా మేము స్వాగతిస్తాం, అనవసరమైన పరుష పదజాలం వాడకుండా మీ ఆవేదన వ్యక్తం చేయడానికి సరైన పద్ధతులు ఉన్నాయి అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మహేష్ బాబుని మునువెప్పుడూ చూడని ఒక మాస్ అవతార్ లో మనం థియేటర్లో చూసి ఎంజాయ్ చేద్దాం అంటూ ఆయన ఈ వివాదాన్ని ముగించే ప్రయత్నం చేశాడు. అయితే అభిమానులను ఈ స్థాయిలో ఘాటు పదజాలంతో మాట్లాడడంతో వారంతా ఒక రేంజ్ లో మళ్ళీ ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఈ అభిమానులే కదా మహేష్ బాబు సినిమాలని రిపీట్ మోడ్ లో చూసి రికార్డు కలెక్షన్లు తెచ్చేది, వాళ్ళు హద్దులు మీరితే చెప్పే పద్దతి ఉంటుంది, ఆయన కూడా ఆ హద్దులు మీరితే చూడడానికి చాలా బాగోదు. ఇక ఇంత మాట్లాడాక ఖర్మ కాలి మహేష్ సినిమా హిట్ కాకుంటే అప్పుడు మ్యూజిక్ మరో లెవెల్లో ఉంటుంది ఫ్యాన్స్ నుంచి. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా ఎందుకు ఈ హడావుడి చేస్తున్నారో ఆయనకే తెలియాలి.