Site icon NTV Telugu

NTR : ‘వార్ 2’ తెలుగు రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

War2

War2

RRR, దేవర సినిమలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో తన మార్కెట్ ను పెంచుకున్నాడు. అందుకే నెక్ట్స్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే హృతిక్ రోషన్ తో వార్ 2 అనే బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Also Read : Tollywood : యంగ్ హీరో సినిమాకు నిర్మాతగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి తనయుడు

ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎన్టీఆర్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా డే 1 భారీ కలెక్షన్స్ వస్తాయి. హిట్ టాక్ వస్తే ఇక ఎంత కలెక్ట్ చేస్తుందని ఎవరు ఊహించలేరు. గతంలో ఆ విషయం అనేక సార్లు నిరూపితమైంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన బడా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ వార్ 2 రైట్స్ ను కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. నాగవంశీ స్వతహాగా ఎన్టీఆర్ ఫ్యాన్ అవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే ఈ విషయమై నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఆయన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ ‘ తారక్ అన్న అభిమానులందరికీ WAR 2 హక్కులను నేను కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదు. మా ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైనా అధికారికంగా మా స్వంత హ్యాండిల్స్ ద్వారా మాత్రమే ప్రకటించబడుతుంది, దయచేసి బయట వినిపించే వార్తలను నమ్మకండి’ అని తెలిపారు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగవంశీతో పాటు ఏషియన్ సునీల్ కూడా వార్ 2 రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు టాక్ అయితే ఉంది.

Exit mobile version