NTV Telugu Site icon

Naga Vamsi: వాళ్ళ మాటలు నమ్మకుండా మీరందరూ ధియేటర్లకు వచ్చి సినిమా చూడండి

Nagavamsi Comments

Nagavamsi Comments

Naga Vamsi Comments at Gunur Kaaram Success Meet: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో కలిసి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ గుంటూరు కారం యూనిట్ ను ఎంతో ప్రేమించిన మీడియా మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, మా గుంటూరు కారం సినిమా నేడు రిలీజ్ అయిందని మీ అందరికీ తెలుసు. దాన్ని జనాలు బాగా ఆదరించారు. మొదటి రోజు కలెక్షన్లు మేము ఆశించిన దాని కంటే ఎక్కువ వచ్చాయి. చాలా రోజుల తర్వాత రిలీజ్ అయిన ఒక తెలుగు రీజినల్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఆనందంగా ఉంది.

Hanu Man Collections: మొదటి రోజు కలెక్షన్స్.. ఆ సినిమాకి డబుల్!

ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో ఇలాంటి ఒక తెలుగు రీజనల్ ఫిలిం రావడంతో దాన్ని బాగా ఎంకరేజ్ చేశారు. కొన్నిచోట్ల అర్ధరాత్రి ఒంటిగంట షోలు పడిన సమయంలో మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ అవన్నీ నిన్న ఈవినింగ్ సెకండ్ షోలకి వచ్చే సమయానికి అంటే ఫ్యామిలీస్ అనేది థియేటర్లకి వచ్చిన తర్వాత మిక్స్డ్ టాక్ కూడా పాజిటివ్ గా మారిపోయింది అన్నారు. చక్కగా ఫ్యామిలీతో కలిసి వచ్చి పండగ రోజు ఎంజాయ్ చేసే సినిమా ఇది. పండక్కి మీరు ఫ్యామిలీతో వచ్చి మహేష్ బాబు త్రివిక్రమ్ గార్ల సినిమాని ఎంజాయ్ చేయండి. పాటలు, ఫైట్లు, కామెడీ, సెంటిమెంట్ అన్నీ ఉన్న ప్రాపర్ పండగ సినిమా మాది. మిగతా వాళ్ళ మాటలు నమ్మకుండా మీరందరూ సినిమా ధియేటర్లకు వచ్చి చూడండి మీరు ఎంటర్టైన్ అవుతారు అన్న గ్యారెంటీ నాది అని చెప్పుకొచ్చారు.