Site icon NTV Telugu

‘భీమ్లా నాయక్’తో బ్లాస్ట్ ఖాయమంటున్న నాగవంశీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ అయిన ఈ మూవీని సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు తమన్ అందించిన గీతాలు చార్ట్ బస్టర్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచాయి. జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ ట్వీట్ చేశారు. ‘ఇప్పుడే లాలా భీమ్లా పాట వీడియో రష్ చూశాను. అబ్బాయిలూ గుర్తు పెట్టుకోండి… 2022 జనవరి 12న థియేటర్లలో బ్లాస్ట్ ఖాయం’ అని పేర్కొన్నారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేశ్‌, మురళీశర్మ, సముతిరకని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్, చిట్టి, పమ్మి సాయి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version