Site icon NTV Telugu

Naga Vamshi: అవన్నీ చెత్త వార్తలు… నమ్మకండి

Naga Vamshi

Naga Vamshi

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ప్రమోషనల్ కంటెంట్ కన్నా ఎక్కువగా గుంటూరు కారం సినిమాను తన మాటలతోనే ప్రమోట్ చేసాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. ఎన్ని సినిమాలు వచ్చినా సంక్రాంతి గుంటూరు కారం సినిమాదే అని తేల్చి చెప్పిన నాగ వంశీ… గుంటూరు కారం సినిమాని ప్రమోట్ చెయ్యడమే కాదు తన సినిమాని ఎవరైనా నెగటివ్ కామెంట్స్ చేసినా ఇమ్మిడియట్ గా రెస్పాండ్ అవుతాడు. అలానే లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమా గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విషయంలో ఘాటుగానే స్పందించాడు నాగ వంశీ.

గుంటూరు కారం నుంచి ఒక మాస్ పాట విషయంలో… మహేష్ బాబు హ్యాపీగా లేడు, రీవర్క్ చేయమన్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మహేష్ బాబు సాంగ్ మార్చమని సీరియస్ గా చెప్పాడు అంటూ రూమర్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో గుంటూరు కారం సినిమాలో నాలుగు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంది. ఇప్పటికే మూడు పాటలు, బిట్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ 21 నుంచి నాలుగో సాంగ్ షూటింగ్ కి వెళ్తున్నాం. అన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలని నమ్మకండి, వాళ్లు క్లిక్స్ కోసం అలాంటివి రాస్తుంటారు… మేము సైలెంట్ గా ఉన్నాము అని మీరు స్ప్రెడ్ చేసే ప్రతి రూమర్ నిజమైపోదు అంటూ నాగ వంశీ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ని రీట్వీట్స్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Exit mobile version