యంగ్ హీరో నాగ శౌర్య, మలయాళ బ్యూటీ మాళవిక నాయర్ కలిసి ఒక సినిమా చేశారు. “హా మాకు తెలుసులే, ఆ సినిమా పేరు కళ్యాణ వైభోగమే… డైరెక్టర్ నందినీ రెడ్డి” అనేయకండి. ఎందుకంటే ఈ న్యూస్ ఆ సినిమా గురించి కాదు. కళ్యాణ వైభోగమే సినిమా 2016లో రిలీజ్ అయ్యింది, ఈ మూవీలో శౌర్య-మాళవిక నాయర్ ల కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. అందుకే ఆర్టిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య-మాళవిక నాయర్ లని పెట్టి మూడున్నర ఏళ్లుగా ఒక సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో షూట్ కంప్లీట్ చేసుకున్న ఇలాంటి ఒక మూవీ ఉందనే విషయం కూడా అందరూ మర్చిపోయిన సమయంలో, న్యూ ఇయర్ కి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నాం అంటూ చిత్ర యూనిట్ ప్రమోషనల్ వీడియో చేశారు.
‘పలానా అబ్బాయి-పలానా అమ్మాయి’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ని జనవరి 2న ఉదయం 11కి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ధమాకా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఫీల్ గుడ్ కంటెంట్ తో తెరకెక్కిందని సమాచారం. ‘పలానా అబ్బాయి-పలానా అమ్మాయి’ అనే టైటిల్ ని షార్ట్ కట్ లో ‘పా పా’ అంటూ అవసరాల శ్రీనివాస్, ఈ మూవీ ఫస్ట్ లుక్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చేశాడు. అవసరాల శ్రీనివాస్ రైటింగ్ లో మంచి సెన్సిబిలిటీస్ ఉంటాయి, మెట్రో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఆ సెన్సిబిలిటీస్ ‘పలానా అబ్బాయి-పలానా అమ్మాయి’ సినిమాలో కూడా ఉంటే నాగ శౌర్య-మాళవిక నాయర్ ఖాతాలో హిట్ పడినట్లే. మరి మూడున్నర ఏళ్ళుగా దాచిపెట్టి, ఇప్పుడు రిలీజ్ చెయ్యనున్న ఫస్ట్ లుక్ తో ‘పలానా అబ్బాయి-పలానా అమ్మాయి’ చిత్ర యూనిట్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.
