Site icon NTV Telugu

Exclusive: అనూష శెట్టితో నాగశౌర్య ప్రేమ వివాహం…

Naga Shourya Marriage

Naga Shourya Marriage

Naga Shourya To Tie Knot With Anusha Shetty: యువ హీరో నాగ శౌర్య ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నవంబర్ 20న నాగశౌర్య వివాహం అనూషతో జరగనుంది. బెంగుళూరులోని జెడబ్యూ మారియట్ వివాహానికి వేదికగా కానుంది. 20 తేదీన ఉదయం 11:25కి ఈ వివాహ ముహూర్తం నిర్ణయించారు. నవంబర్ 19వ తేదీన జరిగే మెహందీ ఫంక్షన్‌తో ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. మెహందీతో పాటు వివాహ వేడుకలకు డ్రెస్ కోడ్ ను ఏర్పాటు చేశారు.

కర్ణాటకకు చెందిన అనూష శెట్టి ది మంగుళూరు దగ్గరలోని కుందాపూర్. ఎన్టీఆర్ అమ్మగారి ఊరు కూడా అదే కావటం విశేషం. ఇంటీరియర్ డిజైనింగ్ లో నిష్ణాతురాలైన అనూష ఉమెన్ అచీవర్స్ లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూషతో నాగశౌర్యకు బెంగుళూరులో పరిచయం. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. పలు ప్రముఖ కంపెనీలకు ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి. శౌర్య బ్రదర్ చేసుకున్నది కూడా కర్ణాటకు చెందిన నమ్రతా గౌడ్‌నే కావటం గమనార్హం.

Exit mobile version