NTV Telugu Site icon

Naga Shaurya: పెళ్ళై ఏడాది కాకముందే నాగశౌర్య వేరు కాపురం.. షాకింగ్ విషయాలు చెప్పిన తల్లి

Shourya

Shourya

Naga Shaurya: అబ్బాయిలు పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తరువాత మారతారు అనేది అందరికి తెల్సిన విషయమే. అత్తాకోడళ్ల మధ్య మగాడు ఇరుక్కున్నాడు అంటే అంతే సంగతులు. ఈ కాలం యువత ఎక్కువ అత్తామామలకు దూరంగా ఉండాలనే కోరుకుంటున్నారు. బంధాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది పెద్దవారు కూడా అర్ధం చేసుకుంటున్నారు. ఇక తాజాగా హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చింది. హీరో నాగశౌర్య ఇండస్ట్రీలో ఎంత ఫేమసో.. అతని తల్లి ఉష కూడా అంతే ఫేమస్. నిర్మాతగా ఆమె ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ కు అందించింది. అంతేకాకుండా ఉషా ముల్పూరి పేరుతో ఒక రెస్టారెంట్ ను ఓపెన్ చేసి.. మంచి ఫుడ్ ను అందిస్తుంది. ఇక నాగశౌర్య గతేడాది పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టిని ఆయన పెళ్లాడారు. బెంగళూరులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి తరువాత నాగశౌర్య వేరుకాపురం పెట్టాడని చెప్పి ఆమె షాక్ ఇచ్చింది.

” అనూష ఎంతో మంచి అమ్మాయి. తను నాకు మూడేళ్ళ క్రితం నుంచే తెలుసు. శౌర్యకు పర్ఫెక్ట్ జోడీ. ఆమెను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకుంటాను. తను కూడా మమల్ని మమ్మా, డాడీ అనే పిలుస్తుంది. నా పెద్ద కోడలు అమెరికాలో ఉంది. అక్కడే యాపిల్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. అనూష ఇంటీరియర్ డిజైనర్. ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని ఆఫీస్ కు వెళ్తుంది. ఎంతో మెచ్యూర్ ఉన్న అమ్మాయి. పెళ్ళైన కొన్నిరోజులకే వాళ్లు వేరు కాపురం పెట్టారు. ఇలా ఉండాలని పెళ్ళికి ముందే చెప్పుకున్నాం. దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటేనే బాగుంటుంది. ఇది ఇప్పుడనుకున్నది కాదు.. పిల్లలు పుట్టినప్పుడు, పెరిగినప్పుడే అలా దూరం ఉండాలని అనుకున్నాం.. ఈ జనరేషన్ లో పిల్లలకు ఫ్రీడమ్ కావాలి. మా పిల్లలకు అలాగే ఇచ్చాం. ఇందులో అంతగా ఆలోచించడానికి ఏమి లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments