Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోయి రెండేళ్లు అవుతుంది. అయినా ఇప్పటివరకు ఖ్ఆ హీట్ మాత్రం పోలేదు. సామ్ సినిమా వచ్చినప్పుడు చై ను.. చై సినిమా రిలీజ్ అప్పుడు సామ్ ను ఆ విడాకుల విషయం అడగకుండా మీడియా వదలదు. ఇక విడాకుల విషయం చెప్పడానికి వీరిద్దరూ ఎప్పుడు నిరాకరిస్తూనే ఉన్నారు.. డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానో ఈ విషయమై ఒక చర్చ అనేది జరుగుతూనే ఉంది. విడాకుల తరువాత వీరిద్దరూ ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పుకొచ్చిన ఈ జంట.. అప్పటి నుంచి ఇప్పటివరకు కలిసి కనిపించింది లేదు. కనీసం ఒకరి బర్త్ డే కు ఇంకొకరు విష్ చేసుకున్నది లేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. చై నా మాజీ భర్త అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది సామ్.. కానీ, చై మాత్రం సామ్ ను ఏరోజు తక్కువ చేసి మాట్లాడలేదు.. ఆన్ స్క్రీన్ పెయిర్ లో తనకు సమంత అంటేనే ఇష్టమని, ఆమె మంచి అమ్మాయి అని చెప్పుకొస్తూనే ఉన్నాడు. ఇకఈసారి చై కొంచెం విడాకుల గురించి మాట్లాడి షాక్ ఇచ్చాడు.
PM Modi: కేరళ స్టోరీ వివాదం.. ఉగ్రశక్తులతో కాంగ్రెస్ ఒప్పుందం చేసుకుందన్న ప్రధాని
కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చై మొదటిసారి విడాకుల గురించి మాట్లాడాడు.. ” మేము విడిపోయి రెండేళ్లు అవుతుంది. లీగల్ గా మాకు విడాకులు వచ్చి ఏడాది అవుతుంది. ఇప్పటికీ మా విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. మేము ఇద్దరం విడిపోయినా.. ఆమెతో నేను గడిపిన రోజులను ఎప్పుడు గౌరవిస్తాను. మేము విడిపోవడానికి కారణం సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే.. మొదట నేను వాటిని పట్టించుకోలేదు. ఆ తరువాత.. తరువాత పరిస్థితులు చేజారిపోయాయి.. ఆ చిన్న చిన్న గొడవలు పెద్దవి అయ్యాయి. ఆ గొడవలు.. చివరికి విడాకుల వరకు వెళ్లాయి.
Prasanth Varma: ‘హను-మాన్’ వాయిదా, త్వరలో కొత్త విడుదల తేదీ!
విడాకుల తరువాత చాలామంది ట్రోల్స్ చేశారు. విడిపోయాక కూడా మేము ఫ్రెండ్స్ గానే ఒకరిపై ఒకరు గౌరవంతోనే ఉన్నాం.. కానీ, వెబ్ సైట్స్, సోషల్ మీడియా.. మా మధ్య గొడవలు.. మేము ఒకరిపై ఒకరు గౌరవం లేకుండా ఉన్నామని రాయడం చాలా బాధ అనిపించింది. నిజానికి సమంత మంచి అమ్మాయి. తాను ఆనందంగా ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక నా గతానికి సంబంధం లేని వ్యక్తులతో కలిపి వార్తలు రాశారు.. ఏదిఏమైనా అన్ని మన మంచికే అని అనుకున్నాను ప్రతిదాని నుంచి నేర్చుకుంటున్నాను.. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.