Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ నిర్మించారు. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ చిత్రం 1మే 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతోప్రమోషన్ల జోరును పెంచిన మేకర్స్ నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. వేదికపై చైతన్య మాట్లాడుతూ.. అభిమానులను మా కుటుంబం దేవుళ్లుగా భావిస్తుందనిచెప్పుకొచ్చి అభిమానుల మనసులను గెలిచాడు. మా అక్కినేని అభిమాన దేవుళ్లందరూ బావున్నారా అంటూ స్పీచ్ మొదలుపెట్టాడు. జోష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకీ మామ.. సౌండ్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పారు.. ఆ సౌండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు అస్సలు తగ్గలేదు.. నేను ప్రతి ఈవెంట్ కు వచ్చే ముందు ఈ ఎనర్జీ, ఈ సౌండ్ కోసమే వస్తాను. నేనెప్పుడూ మీతో పాటే ఉండాలనుకుంటాను. అందుకే ఈరోజు ఫోటోషూట్ పెట్టి మీ అందరికి ఫోటోలు ఇచ్చి.. మీతో మాట్లాడాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
విరూపాక్ష కన్నా ముందు చేతబడుల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఇవే..
వెంకట్ గారు ఈ సినిమా కథ చెప్పగానే వెంటనే లేచి ఆనందంతో ఆయనను హాగ్ చేసుకున్నాను. షూటింగ్ చేసేటప్పుడు, ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు, ఈ స్టేజి మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు అదే ఆత్రుతతో.. అంతే కాన్ఫిడెన్స్ ఇచ్చేలా చేసింది. కోలీవుడ్ లో వెంకట్ ప్రభును మాస్ అంటారు.. ఆయన అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్, శింబు లాంటి స్టార్ పనిచేశారు . ఎన్నో మంచి హిట్లు ఇచ్చారు. ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాలకు వచ్చి తెలుగువారిని ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థాంక్యూ వెంకట్ .. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో కూర్చోపెట్టారు. ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి గారు చేస్తున్నారు అని తెలియగానే సినిమా మీద చాలాకాన్ఫిడెంట్ వచ్చింది. ఇక సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. శరత్ కుమార్, ప్రియమణి.. కృతి.. చాలా మంచి పొజిషన్ కు వెళ్తావ్.. మూడేళ్ళలో ఎన్నో నేర్చుకున్నావు .. తెలుగు, తమిళ్ అన్ని కష్టపడి నేర్చుకున్నావు.. మంచి భవిష్యత్తు ఉంది నీకు.. ఇక ఇళయ రాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్.. నాకు ఇప్పటికీ నిద్రపోయేటప్పుడు అదే స్కోర్..లేచినప్పుడు అదే స్కోర్ వినిపిస్తూ ఉంటుంది.. అంత బాగా ఇచ్చారు. ఇక సినిమా మొదటి 20 నిముషాలు డైరెక్టర్ గారిలా కూల్ గా ఉంటుంది.. 40 నిమిషాలు అయ్యాక సినిమా మొదలవుతుంది.. థియేటర్ లో బ్లాస్టే.. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంది.. నిజంగా ఈ సినిమాలో కొత్త చైతు ను చూస్తారు. మే 12 న మీరందరూ నా కస్టడీలోకివచ్చేస్తారు .. నా కష్టడీలోనే ఉండాలని కోరుకుంటున్నాను.. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి” అంటూ ముగించాడు.