అక్కినేని నాగ చైతన్య.. తన పని తప్ప వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వడు. సోషల్ మీడియాలో కూడా అవసరమైతే తప్ప స్పందించాడు. ఇక గతేడాది భార్య సమంత తో విడిపోయాకా చై లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందులా సోషల్ మీడియాలో అవసరానికి కనిపించకుండా కొద్దిగా యాక్టివ్ గా ఉంటున్నాడు. తాజగా చైతూ సోషల్ మీడియా లో ఒక బీచ్ ఫోటోను షేర్ చేశాడు. ఎప్పుడు లేనిది ఈ ఫోటో పోస్ట్ చేయడం వెనుక రహస్యం ఏంటి అని అభిమానులు బుర్రలు గోక్కుంటున్నారు. చల్లని సాయంత్రం వేళ బీచ్ అందాలను దూరం నుంచి క్యాప్చర్ చేసినట్లు కనిపిస్తోంది. లొకేషన్ ఎంతో ఆహ్లాదంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ పోస్ట్ కి చై ‘బ్రీత్’ అని క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ ప్లేస్ ఎక్కడ.. ఏంటి అనే వివరాలను చై చెప్పలేదు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఫోటో ఏదైనా చైతన్యలో వచ్చిన ఈ మార్పుకు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడాకుల తరువాత మౌనంగా ఉన్న చై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చైతన్య ప్రస్తుతం థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఏ సినిమా విడుదలకు సిద్దమవుతుంది.
