Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే థాంక్యూ సినిమా అభిమానులను నిరాశపర్చింది. ప్రస్తుతం చై ఆశలన్నీ తన బాలీవుడ్ డెబ్యూ లాల్ సింగ్ చద్దా సినిమాపైనే పెట్టుకున్నాడు. అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలను పంచుకొంటున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్యకు డేటింగ్ రూమర్స్ పై ప్రశ్న ఎదురయ్యింది.
గత కొన్ని రోజుల నుంచి నటి శోభితా దూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. ఇక ఈ రూమర్స్ పై శోభితా స్పందిస్తూ అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా చై కూడా వీటిని ఖండించాడు. “ఇటీవల నామీద చాలా రూమర్స్ వస్తున్నాయి. ప్రతివారం ఏదొక రూమర్.. వాటిని వింటుంటే నాకు నవ్వు వస్తుంది. నా జీవితానికి అస్సలు సంబంధం ఎన్ని వార్తలు నాకు అంటగడుతున్నారు. అసలు ఈ వార్తలను ఎలా పుట్టిస్తున్నారో తెలియడం లేదు. మొదట్లో వీటిని చూసి నవ్వుకొనేవాడిని, ఇప్పుడు వాటి గురించి అసలు పట్టించుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వార్తలు అన్ని పుకార్లే అని చై క్లారిటీ ఇచ్చేశాడు. ఇక కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతున్న ఈ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.