Site icon NTV Telugu

నాగశౌర్య ‘లక్ష్య’ గీతాన్ని విడుదల చేసిన నాగచైతన్య…

యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ ‘లక్ష్య’ చిత్రం ఈ నెల 10వ తేదీ విడుదల కాబోతోంది. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, గాయకుడు కాలభైరవ స్వరరచన చేశారు. ఆయన స్వరాలు అందించగా, కృష్ణకాంత్ రాసిన ‘సాయా సాయా’ అనే గీతాన్ని జునైత్ కుమార్ పాడారు. ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘లక్ష్య’ మూవీ ట్రైలర్ ను చూసి బాగా ఎంజాయ్ చేశానని, ఈ పాట కూడా చాలా బాగుందని చిత్ర బృందానికి చైతు కాంప్లిమెంట్ ఇచ్చాడు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ఈ రేసీ నంబర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆర్చరీ నేపథ్యంలో ఇండియాలో తొలిసారిగా రూపుదిద్దుకున్న ‘లక్ష్య’ చిత్రాన్ని సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ దాస్ కె నారంగ్, పుస్కర్ రామ్మోహన్, శరత్ మరార్ నిర్మించారు. ఇప్పటికే వెంకటేశ్ విడుదల చేసిన మూవీ ట్రైలర్ కూ మంచి స్పందన వచ్చి, సినిమాపై అంచనాలను పెంచేసింది.

Exit mobile version